ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నిన్న పీఆర్సీ పై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పీఆర్సీ నివేదిక పై అధ్యయనంపై అధికారుల కమిటీ వివిధ సందర్భాల్లో భేటీ అయ్యామని… మా సూచనలను సీఎం జగన్ మోహన్ రెడ్డి కు నివేదించామనీ ఆయన వెల్లదించారు.నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలని..5 అంశాలను మార్పులతో అమలు చేయాలని.. 2 అంశాలు అమలు చేయనక్కర్లేదని సూచించామనీ పేర్కొన్నారు.
మూడు రోజుల్లోగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సచివాలయ ఉద్యోగులకూ పీఆర్సీని అమలు చేయాలని సిఎం జగన్ కు సూచించామని.. దానిపై సిఎం కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఉద్యోగులకు 27 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ఇవ్వాలని.. కార్యదర్శుల కమిటీ నివేదిక ఇచ్చిందని సీఎస్ సమీర్ శర్మ ఈ సందర్భంగా వివరించారు.
0 comments:
Post a Comment