త్వరలోనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరి స్తామని ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపామన్నారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చిం చామన్నారు. కరోనా కారణంగా పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కర్నీ ఫ్యాన్లీ మెంబరుగా భావిస్తుందన్నారు. టైమ్ బౌండ్ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుక ని పరిష్కరిస్తామని హామీ నిచ్చారు. ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతా రన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కంటిన్యూగా టచ్లో ఉంటామన్నారు.ఉద్యమంలో ఉన్న తొమ్మిది సంఘాలను ఆందోళన విరమించాలని కోరడం జరిగిందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment