నూతన సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ఆఫర్
నూతన సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ఇప్పటివరకు యూజర్లు రూ.2,545 రీచార్జ్ చేసుకుంటే 336 రోజుల ప్లాన్ వ్యాలిడిటీ వస్తోంది.అయితే ఆఫర్ లో వ్యాలిడిటినీ 29 రోజులకు పెంచి 365 రోజులు చేశారు. ఈ ప్లాన్ కింద రోజుకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1.5జీబీ హై స్పీడ్ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, జియో ప్లాట్ ఫామ్ పై ఇతర సదుపాయాలు (జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్) పొందొచ్చు. ఈ ప్లాన్ ప్రస్తుత యూజర్లకే కాకుండా, కొత్త యూజర్లకు సైతం లభించనుంది. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుంది. జనవరి 2 వరకు ఈ ఆఫర్ ఉంటుందని జియో తెలిపింది.
జియో ఇంకో ప్లాన్ ను కూడా ఆఫర్ చేస్తోంది. రూ.2,879 రీఛార్జ్ పై 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటాను పొందొచ్చు. ఇందులోనూ నిత్యం 100 ఎస్ఎంఎస్ లు, ఇతర సదుపాయాలు ఉంటాయి. 20 శాతం జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రూ.719, రూ.666, రూ.299 రీఛార్జ్ ప్లాన్లను సైతం ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్లను రీచార్జ్ చేసుకున్న వారు జియోమార్ట్ పై చెల్లింపులకు ఉపయోగపడే క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment