పదో తరగతి విద్యార్థుల మార్కుల మెమోలను ఆయా పాఠశాలలకు పంపినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 6,26,981 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 6న విడుదల చేసింది. మార్కుల జాబితాలను పాఠశాలలకు బుధవారం నుంచే పంపిన్నట్టు డైరెక్టర్ తెలిపారు. మార్కుల జాబితాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు అనుసరించాల్సిన విధివిధానాలను బోర్డు వెబ్‌సైట్ షషష.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ లో పొందుపరిచిన్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆయా పాఠశాలల నుంచి మార్కుల జాబితాను పొందగలరని వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment