పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చి తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాదని తెలుసుకుని ఉద్యమానికి పిలుపునిచ్చామన్నారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేదని బొప్పరాజు చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగజేయొద్దనే సంయమనంతో ఉన్నామని.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ''ప్రభుత్వం మొక్కుబడిగా ఒకట్రెండు సమావేశాలు నిర్వహించింది. దీనివల్ల ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. పీఆర్సీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించినా పట్టించుకోలేదు. కనీసం దానికి సంబంధించిన నివేదిక బయటపెట్టలేదు. దానికి కూడా ఎందుకు జంకుతున్నారు. నివేదిక బహిర్గతం చేయనివాళ్లు పీఆర్సీ ప్రకటిస్తారని ఎలా అనుకుంటాం? ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందనే భావన ఉద్యోగుల్లో ఉంది'' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment