అమరావతి: ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణపై సీఎం చర్చిస్తున్నారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరుగనుంది. కమిషన్ సిఫార్సులను పరిశీలించి ఎంత మేర వేతనాలు పెంచాలనే అంశంపై జగన్ చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల మిగిలిన సమస్యల పరిష్కారంపైనా, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ తదితర డిమాండ్లపై సమావేశంలో చర్చ జరుగనుంది. పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తాననని ఈనెల 3న తిరుపతిలో ఉద్యోగులకు సీఎం జగన్ హామి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నేటి సమావేశంలో ఫిట్ మెంట్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగులకు ప్రొహిబిషన్ ఖరారుపైన సమావేశంలో సీఎం జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
0 comments:
Post a Comment