రెండు అడుగులు తగ్గినంత మాత్రాన తమ నిజాయితీని శ ంకించాల్సిన అవసరం లేదని..ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే నాలుగు అడుగులు ముందుకు దూకుతామని జేఏసీ ఐక్యవేదిక అగ్రనేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.శివారెడ్డి అన్నారు. డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఆర్థికశాఖ మంత్రి, సీఎస్ ప్రయత్నాలు చేస్తున్నందున తాత్కాలికంగా విరమణ చేశామే తప్ప.. ఏసీబీ కేసులకు భయపడి ఉద్యమాన్ని విరమించలేదన్నారు. తమను విమర్శించే సీపీఎస్ నాయకులు ఏ ఉద్యమంలో పాల్గొనని వారిని నిలదీయాలన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నపుడు ఘర్షణ వైఖరిని ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా హర్షించరన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నామని, ఏమీ చేయలేకపోతే మాత్రం ఉద్యమంలోకి రెట్టించిన ఉత్సాహంతో దిగుతామని చెప్పారు. ఏపీ కాంట్రాక్టు- అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి బొప్పరాజు, శివారెడ్డిలను ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. స్ట్రగుల్ కమిటీతో సీఎస్, ఆర్థిక మంత్రి చర్చించాకే తాత్కాలిక విరమణకు అంగీకరించామని బొప్పరాజు అన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి తామేమీ కోట్లు సంపాదించుకోలేదని చెప్పారు. అవగాహన లేకుండా సీపీఎస్ నాయకత్వం తమను ప్రశ్నిస్తోందన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఎవరు ఇప్పించారో ఒక్కసారి తెలుసుకుని మాట్లాడాలన్నారు. బెజవాడలో సింహగర్జన సభ పెడితే అందులో మొదటిగా తాము పాల్గొన్నామన్నారు. ఆ రోజున తమ ఐక్యవేదిక తరఫున 71 డిమాండ్ల పోరాటంలో మొదటిది పీఆర్‌సీ అయితే రెండోది సీపీఎస్ రద్దు అన్న విషయాన్ని సభా వేదికగా చెప్పానన్నారు. శివారెడ్డి మాట్లాడుతూ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్‌కా్‌సను ఏర్పాటు చేశారని, ఇంకా లక్ష మందికి పైగా దానిలో చేరాల్సి ఉందన్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment