సిఎస్ డా.సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం CS విడుదల చేసిన పత్రికా ప్రకటన
అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమవేశంలో ఉద్యోగుల పిఆర్సితో పాటు మిగతా డిమాండ్లపై చర్చించారు.ఈసందర్భంగా సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ గత జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిఆర్సి పిట్మెంట్ మినహా మిగతా 70 డిమాండ్ల పరిష్కారానికి పరిశీలన చేస్తున్నామని తెలిపారు.దీనిపై బుధవారం కార్యదర్శుల సమావేశంలో చర్చించామని త్వరలో ఆయా డిమాండ్లలో వీలైనన్నిటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఉద్యోగ సంఘాలకు సిఎస్ స్పష్టం చేశారు.పిఆర్సీ పిట్మెంట్,పెండింగ్ బిల్లులు చెల్లింపు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాల స్పందనను తీసుకున్నామని వీటిపై మరొక సారి పరిశీలించి మరలా మీముందుకు వస్తామని సిఎస్ డా.సమీర్ శర్మ చెప్పారు.ప్రభుత్వం మీవెంట ఉందని అన్ని అంశాలను విశాల దృక్ఫదంతో సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.
ఎపి జెఎసి,ఎపి జెఎసి అమరావతి,ఎపి సచివాలయం సంఘం,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం,ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జిపిఎఫ్,ఎపి జిఎల్ఐ,మెడికల్ రీఇంబర్సుమెంట్,ఆర్జిత సెలవులు(ఎస్ఎల్ఎస్)కు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ణప్తి చేశారు.దానిపై సిఎస్ సమీర్ శర్మ స్పందించి ప్రాధాన్యతా క్రమంలో ఆయా బిల్లులను విడుదల చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈసమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్,ఆర్ధిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,ఆర్ధికశాఖ ఇఓ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సేవలు)పి.చంద్రశేఖర్ రెడ్డి,ఎపి జెఎసి,ఎపి జెఎసి అమరావతి ఐక్యవేదిక,ఎపి సచివాలయం సంఘం,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,బొప్పరాజు వెంకటేశ్వర్లు,కె.వెంట్రామిరెడ్డి,సూర్యనారాయణ,మిగతా ఉద్యోగ సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
(ప్రచార విభాగం సమాచారశాఖ అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)
0 comments:
Post a Comment