బాబోయ్ ఉద్యోగుల కు చుక్కలు చూపిస్తున్న పి ఆర్ సి సి ఎస్ కమిటీ?
ఏపీలో కొన్నిరోజులుగా ఉద్యోగులు, ప్రభుత్వానికి జరుగుతున్న ఘర్షణ వాతావరణం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది. ప్రధానంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ అమలు అంశాన్ని సీఎం 3 రోజుల్లో తేల్చేయబోతున్నారు.ఈ మేరకు సీఎస్ కమిటీ తేల్చి చెప్పింది. అయితే.. పీఆర్సీపై ఈ సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫారసులు చూస్తే ఉద్యోగులకు షాక్ తగలక మానదు. ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 30- 40 శాతం ఫిట్‌మెంట్ కోరుతుంటే.. సీఎస్ కమిటీ మాత్రం 14 శాతం ఇస్తే చాలని సీఎంకు సిఫారసు చేసింది.
అంతే కాదు.. ఆ ఇచ్చేది వచ్చే ఏడాది అక్టోబరు నుంచి నగదు రూపంలో ఇవ్వాలని సూచించింది. ఫిట్ మెంట్ మాత్రమే కాదు.. అనేక విషయాల్లో సీఎస్ కమిటీ సిఫారసులు ప్రభుత్వ ఉద్యోగులకు మింగుడుపడటం లేదు. అవేంటంటే.. ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి అద్దె భత్యమూ తగ్గించాలని సీఎస్ కమిటీ సిఫారసు చేసింది. అంతే కాదు.. సీసీఏ ఎత్తివేతకూ ప్రతిపాదించింది. ఇకపై అమరావతి ఉద్యోగులకు అదనపు అద్దెభత్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతిపాదించింది.
ఇక నుంచి రాష్ట్ర వేతన సవరణ కమిషన్లు ఉండబోవని తెలిపింది. ఇక హోంగార్డులకు అదనపు ప్రయోజనాలు అక్కర్లేదని కూడా సీఎస్ కమిటీ సిఫారసు చేసింది. ఫిట్ మెంట్ విషయంలోనే కాదు.. ఇంటి అద్దె భత్యం విషయంలోనూ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సులు ఫాలో అవ్వాలని సీఎస్ కమిటీ సీఎంకు సూచించింది. ఇలా అడుగడుగునా సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫారసులు ఉద్యోగులకు ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి. అయితే.. ఇవన్నీ కేవలం సీఎస్ కమిటీ సిఫారసులు మాత్రమే అన్న సంగతి మర్చిపోకూడదు.
ఇలా సీఎస్ కమిటీతో ముందుగా ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేసి.. ఆ తర్వాత.. అంతకు మించి ఇవ్వడం ద్వారా కాస్త సంతోష పరచవచ్చన్నది జగన్ వ్యూహం అయిఉండొచ్చు. కానీ.. ఈ సీఎస్ కమిటీ సిఫారసులనే సీఎం కూడా ఆమోదించి ఓకే చెబితే.. ఉద్యోగ సంఘాలు రోడ్లమీదకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
0 comments:
Post a Comment