ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు డాన్స్ స్టాప్ కౌన్సిల్ సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాలను పిఆర్సి నివేదిక గురించి చర్చించడానికి ఈ సమావేశానికి ఆహ్వానించారు ఈ సమావేశానికి సంఘ నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం నందు కూడా ఉద్యోగికి పీఆర్సీ నివేదిక ఇవ్వకుండానే సమావేశం ముగించిన అధికారులు. సాంకేతిక అంశాలు అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పిన అధికారులు.
పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా చర్చలెలా సాధ్యమని ప్రశ్నించారు. దీంతో కార్యదర్శుల కమిటీ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... 71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ ఇచ్చామని తెలిపారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.
0 comments:
Post a Comment