ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు 11వ పీఆర్సీసీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ కోరుతూ నిరసనలు చేపట్టారు. సీఆర్‌పై నివేదిక ఇవ్వాలంటూ సీఎం జగన్ సీఎస్ కమిటీని ఏర్పాటు చేశారు.
సీఎస్ కమిటీ 14.29తో కూడిన పీఆర్‌సీని అమలు చేయాలంటూ నివేదిక సమర్పించారు. సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదక పూర్తిగా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు తెలిపారు. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ పీఆర్‌సీపై స్పష్టత నెలకొనలేదు. తాజాగా నేడు కూడా సజ్జల ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు.
భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. పీఆర్‌సీపై సీఎం జగన్ సోమవారం నిర్ణయం తీసుకుంటారని, మిగితా 70 డిమాండ్లపై చర్చించి బుధవారం నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అంతేకాకుండా ఉద్యమాన్ని పూర్తిగా మేం విరమించలేదన్నారు. అయితే మా డిమాండ్ల పరిష్కారంపై లిఖితపూర్వక హామీ ఇచ్చారని, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేందుకే ఉద్యమం తాత్కాలిక వాయిదా వేశామని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. సమస్యల పరిష్కార బాధ్యత సీఎంవో అధికారికి ఇస్తామన్నారని తెలిపారు
0 comments:
Post a Comment