ఉద్యోగులు నష్టపోరాదు సజ్జలతో సీఎం జగన్ - తగిన ప్రతిపాదనలతో రండి


ఉద్యోగులు నష్టపోరాదు సజ్జలతో సీఎం జగన్ - తగిన ప్రతిపాదనలతో రండి

ఉద్యోగుల వేతన కమిటీ సిఫార్సుల పై నిర్ణయాన్ని ప్రభుత్వం ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. ఫిట్మెంట్, ఐఆర్ విషయంలో వ్యత్యాసాలు.. ప్రభుత్వంపై అదనపు భారం తదితర అంశాలపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చిం చారు. ఫిట్మెంట్, ఐఆర్ హెచ్చుతగ్గుల కారణం గా ఉద్యోగులు ఏ రకంగా నష్టపోతారు.. నష్టపో కుండా ఏం చేయాలనే దానిపై తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశిం చినట్లు తెలియవచ్చింది. ఉద్యోగులు నష్టపోకుండా తగిన నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం మధ్యంతర భృతిగా 27 శాతం ప్రభుత్వం అమలు చేస్తోంది.. దీంతో పాటు ఫిట్మెంట్ 14.29 శాతం ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై మూడువేల కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంత పెద్ద అదనపు భారాన్ని ప్రభుత్వం మోసే పరిస్థితుల్లోలేదని చెప్తున్నారు. దీంతో ఫిట్మెంట్, ఐఆర్లపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ముందుగా ఆర్థికేతర అంశాలను పరిష్క రించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు చెబుతున్నారు. పీఆర్సీపై ఆచితూచి అడుగేసి ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగులు నష్టపోకుండా మధ్యేమార్గంగా పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా పీఆర్సీని ప్రకటి స్తారని భావించారు. ఉద్యోగులతో సోమవారం సాయంత్రం తుది విడత చర్చలు జరపనున్నట్లు ప్రక టించారు. అయితే ఇప్పటికిప్పుడే ఇది తేలే వ్యవహారం కాదు కనుక సావధానంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగా బుధవారం ఉన్నతాధికారులతో జరిగే సమావేశం సందర్భంగా కొన్ని ఆర్థికేతర అంశాలు పరిష్కారం చేయటంతో పాటు పీఆర్సీపై మరోసారి నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికితోడు మంగళవారం నుంచి వచ్చే సోమ వారం వరకు ముఖ్యమంత్రి వరుస పర్యటనలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. 21న పశ్చిమ గోదావరి, 22న కర్నూలు జిల్లాల్లో సీఎం పర్యటించ నున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈనెల 23 నుంచి సొంత నియోజకవర్గం పులివెందులలో గడపను న్నారు. దీంతో చర్చల ప్రక్రియ వచ్చే వారానికి వాయిదా పడింది. ముఖ్యమంత్రితో భేటీ వివరాలను సజ్జల _మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రితో ఉద్యోగుల ఫిట్ మెంట్ పై మరో మారు సుదీర్ఘంగా చర్చించాం.. ఐఆర్ కంటే తగ్గకుండా ఉద్యోగులు నష్టపోకుండా ఫిట్ మెంట్ ఉండేలా చూడమని సీఎం చెప్పారు.. తెలంగాణాలో ఐఆర్ ఇవ్వకుండా ఫిట్ మెంట్ 30 శాతం ఇచ్చారు.. ఇక్కడ ముందస్తుగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాము. అయినా ఉద్యోగులు 14.29 శాతం ఫిట్ మెంటుతో నష్టపోతున్నాం అంటున్నారు. వాళ్ళకి నష్టం జరగకుండా తగిన ప్రతిపాదనలతో రావాలని సీఎం చెప్పారు. దీనివల్ల ఫిట్ మెంట్ విషయం క్రిస్టమస్ తర్వాత నిర్ణయం అయ్యే అవకాశం ఉంది” అని తెలిపారు. ‘‘ఈ లోపు అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తారు. ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నాలుగైదు రోజుల్లో ఆర్థికేతర అంశాలను అధికారులు పరిష్కరిస్తారు. ఈ నెలాఖరులోపు ఫిట్ మెంట్పై నిర్ణయం ఉంటుంది. పీఆర్సీపై ముఖ్య మంత్రితో వివరంగా చర్చించాం.. త్వరలోనే కొలిక్కి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులకు ముందుగానే వివరించామన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఆర్సీపై తుది ప్రకటన చేస్తారని సీఎంఓ నుంచి పిలుపు వస్తుందని నిరీక్షించిన జేఏసీ నేతలు నెలాఖరులో నిర్ణయం| ఉంటుందనే ప్రకట నతో ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో విజయవాడలో ఇరుజేఏసీల ఆధ్వర్యంలో స్ట్రగుల్ కమిటీ సమావేశం నిర్వహిం చారు. పీఆర్సీ మాట అటుంచి క్రిస్మస్, సంక్రాంతి పండుగలు వస్తున్నందున తమకు చెల్లించాల్సిన రూ.16 వందల కోట్ల బకాయిలను విడుదల చేయకపోవటాన్ని ఉద్యోగ నేతలు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం సచివాలయంలో జరిగే చర్చల అనంతరం 23న కార్యాచరణ చేపట్టాలని తాజా సమావేశంలో నిర్ణయించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top