కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మూల వేతనం పెంచాలని ఏపీ జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ధర్నా చౌక్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ గురువారం ధర్నా చేపట్టింది ఈ ధర్నాలో శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 శాతం పిట్‌మెంట్ అడుగుతున్నామన్నారు. ఉద్యోగుల కనీస వేతనం రూ. 23 వేలు ఉండాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ రూ. 23 లక్షలకు పెంచాలన్నారు. డిమాండ్లపై సరైన స్పందన ఉంటేనే ప్రభుత్వంతో చర్చిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment