పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. రాష్టంలో ఇప్పటికే ఐదు డీఏలు పెండింగులో ఉన్నాయి. జనవరి వస్తే దీనికి మరో డీఏ యాడ్ కానుంది. ఈ డీఏలను వెంటనే ప్రకటించాలని సైతం ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. పీఆర్సీ తరువాత డీఏలను పరిష్కరిస్తారన్నారు. మొత్తానికి నేటి సాయంత్రానికి పీఆర్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ETV News:ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నేటి సాయంత్రం పీఆర్సీ ప్రకటించే అవకాశం ?
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నేటి సాయంత్రం పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా పీఆర్సీ కసరత్తు పూర్తైంది. పీఆర్సీ నివేదిక, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ నోట్ రెడీ చేసింది. ఈ సాయంత్రం రిపోర్ట్‌ను సీఎస్‌కు సీఎం జగన్‌కు ఇవ్వనున్నారు. అనంతరం ఉద్యోగ సంఘాలకూ రిపోర్ట్ ఇవ్వనున్నారు. అనంతరం పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం అయ్యే అవకాశం అవకాశం ఉంది. ఈ సమావేశానంతరం జగన్ పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment