సీపీఎస్ రద్దే మాకు ముఖ్యం APCPSUS వజ్ర సంకల్ప దీక్ష
'మాట తప్పవద్దు- మడమ తిప్పవద్దు సీపీఎస్ రద్దే మాకు ముద్దు' అంటూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన వజ్ర సంకల్ప దీక్షలో ఏపీ సీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎం దాసు, మొండి రవికుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్ర సమయంలో మన ప్రభుత్వం అధికారం లోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, కానీ రెండున్నరేళ్లు గడిచాయని, ప్రభుత్వానికి మాత్రం ఇంకా వారం రోజులు కాలేదా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిచేలా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని వ్యాఖ్యానించారు. సీపీఎస్ ఉద్యోగుల ఆవేదన, ఆక్రందన ప్రభుత్వానికి శాపనార్థాలు కాకూడదన్నారు. కనుక వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిస్తే ఉద్యోగులు ఎప్పటికీ మిమ్మల్ని మరిచిపోరన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ తలమర్ల ప్రభాకర్, నేతలు బిల్ వెంకటేష్, రామంజి, పవన్ కుమార్, భాగ్యరాజ్, మన్మోహన్ నాయుడు, మూర్తి యాదవ్, ఆనంద్, మనోహర్, ఆంజనేయులు, శ్రీనివాసులు, మూర్తి, నాగభూషణం, సురేష్ కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment