ఉద్యోగుల మంచితన్నాన్ని అలుసుగా తీసుకోవద్దని, వెంటనే పీఆర్సీ అమలుతో పాటు సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం వంటి 71 డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారుఏపీజేఏసీ జిల్లా చైర్మన సీహెచ వెంగళరెడ్డి అధ్యక్షతన కర్నూలు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో మంగళవారం ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నేతల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఏపీజేఏసీ-అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటించాలంటూ ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు, ఆఖరికి సీఎం జగనమోహనరెడ్డికి కూడా విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఉద్యమానికి సిద్ధమయ్యామన్నారు. రాష్ట్రంలోని 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కర్నూలు నుంచే ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నెలలో ఏదో ఒక రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వస్తుంది కదా హేళనగా మాట్లాడడం తగదన్నారు. పీఆర్సీ అమలు చేయకపోయినా, డీఏలు బకాయిలు ఉన్నా కరోనా కాలంలో రెండు నెలలు వేతనాలు అలస్యంగా ఇచ్చినా ప్రభుత్వాన్ని ఏమీ అనలేదని గుర్తు చేశారు. ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి వచ్చినా ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అగాఽథం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక పట్టామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment