11 వ పిఆర్సి ఇస్తామని చెప్పినా ఉద్యమం విరమించేది లేదు:
ఉద్యోగులు నిర్వహిస్తున్న సింహగర్జన కార్యక్రమానికి ఏపీ జేఏసీ అమరావతి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్‌ను..మూడేళ్లయినా రద్దు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అనేక రకాలుగా సహకరించాయన్నారు. 11వ పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా.. ఉద్యమం విరమించేది లేదని, సీపీఎస్ రద్దు చేస్తేనే ఉద్యమం విరమిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.
కాగా విజయవాడలో ఉద్యోగ సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. పీఆర్సీ, పెండింగ్ డీఏ, సీపీఎస్ రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment