ఉద్యోగుల పనిదినాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు నాలుగున్నర రోజులే పనిదినాలు ఉంటాయని ప్రకటించింది. ఇన్ని రోజులో యూఏఈలో ఐదు రోజుల పనిదినాలు ఉండేవి దాని ప్రకారం శని, ఆదివారాలు సెలవు. ఇక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకే విధులు ఉంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వారాంతపు సెలవులు మొదలు అవుతాయి. ఇకపై అక్కడి ఉద్యోగులకు వారానికి రెండున్నర రోజులు సెలవులుగా లభిస్తాయి. ఈ నూతన విధానం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని యూఏఈ పాలకవర్గం తెలిపింది. ఈ నిర్ణయం తో ఇక నుంచి దుబాయ్, అబుదాబీ, షార్జా వంటి నగరాల్లో సెలవు దినాలు మారనున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment