*APSCERT వారు విడుదల చేసిన క్యాలెండర్ లో ఐచ్ఛికంగా పేర్కొన్నారు...
ఆంధ్ర టీచర్స్( నవంబర్ 18) ది 19.11.21 న ప్రపంచ టాయిలెట్ డే నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ వారు విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ నందు పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది వాటిలో కొన్ని నిర్బంధము మరికొన్ని ఐచ్ఛికంగా పేర్కొనడం జరిగింది . వాటిలో ప్రపంచ టాయిలెట్ నిర్వహణ ఐచ్ఛికంగా పేర్కొన్నారు. ఇదే రోజున కార్తీక పౌర్ణమి ఐచ్ఛిక సెలవు ఉండటంతో సెలవు తీసుకోవచ్చా ? లేదా? అనే సందేహం తలెత్తింది. జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం వారు పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ఈ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు వీరు జారీ చేసిన ఉత్తర్వుల్లో పాఠశాలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని, అధికారులు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.
రేపు యధావిధిగా ఉపాధ్యాయులు OH వినియోగించుకోవచ్చని ఎలాంటి అభ్యంతరం లేదని సెలవు తీసుకున్న పాఠశాల వారు తరువాత రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.... పూర్తి స్థాయి అధికారుల ఆదేశాల కోసం వేచి చూడండి....
APSCERT Academic Calendar:
AP SCERT Latest Instructions
రేపు ప్రపంచ టాయిలెట్ దినోత్సవ సందర్భంగా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రేపు కార్తిక పూర్ణిమ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది కాబట్టి తమ పాఠశాలలకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. మరొకవైపు, పేరెంటు కమిటీలు, ఉపాధ్యాయులు రేపు టాయిలెట్లను స్వయంగా శుభ్రపరచాలని విద్యాశాఖ 'వింత' ఆదేశాలు ఇచ్చిందని ఈ రోజు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు కూడా ప్రచురించబడ్డాయి.కాబట్టి పై నేపథ్యంలో మరింత స్పష్టత కోసం ఈ కింది సూచనలు ఇస్తున్నాం:
అ) 19-11-2021 నాడు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం అన్ని పాఠశాలల్లోను నిర్వహించాలి.
ఆ) అయితే ఏ పాఠశాలలైనా ఆప్షనల్ హాలిడే ప్రకటించుకుంటే వారు ఈ కార్యక్రమం మరొకరోజు నిర్వహించుకోవచ్చు.
ఇ) ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం పాఠశాల విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో పాఠశాల టాయిలెట్ల ఆవశ్యకత గురించి వివరించడం,
ఇ) పాఠశాలల టాయిలెట్ల నిర్వహణను ఎంతో చక్కగా అమలు చేస్తున్న ఆయాల విధినిర్వహణను గుర్తిస్తూ వారిని మనః పూర్వకంగా అభినందించడం,
ఈ) టాయిలెట్ల నిర్వహణ, పాఠశాల పారిశుద్ధ్యనిర్వహణ అత్యంత ఆవశ్యకం మాత్రమే కాదు, ఒక పవిత్ర కర్తవ్యం కూడా. మహాత్మాగాంధీ స్ఫూర్తితో భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు చేపట్టింది. ఈ స్ఫూర్తి మరింత ప్రజ్వలం కావటానికి విద్యాశాఖ అధికారులు కూడా స్వయంగా శ్రమదానం చెయ్యాలని కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ శ్రమదానం స్వచ్ఛందం, ఐచ్ఛికం. ఇందులో భాగంగా రేపు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య సలహాదారు, విద్యాశాఖ సంచాలకుడు, మిడ్ డే మీల్ డైరక్టరు, సమగ్రశిక్ష రాష్ట్రసంచాలకులు కొన్ని పాఠశాలల్లో స్వయంగా శ్రమదానం చేయనున్నారు.
ఉ) అంతేకాదు, టాయిలెట్లను పరిశుభ్రం చేసుకోవడం పట్ల సమాజంలో ఉన్న అపోహల్ని, స్టిగ్మాను పారద్రోలడానికి ఈ కార్యక్రమ నిర్వహణ ఎంతగానో ఉపకరిస్తుంది అని ఆశిస్తున్నాం.
_FROM AP SCERT
0 comments:
Post a Comment