*8వ తేదీన పీఆర్సీ నకలు కాపీలను ఉద్యోగ సంఘాలకు పంపుతామని సీఎస్ హామీ
ఆంధ్ర టీచర్స్ (నవంబర్ 6 )అమరావతి జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్ప రాజు వెంకటేశ్వర్లు తదితర నేతలు శుక్రవారం సచివాల యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మతో మరోసారి భేటీ అయ్యారు. పీఆర్సీ నివేదికను అందించా లని విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి పరిశీలన పూర్తయిన తరువాత ఈనెల 8వ తేదీన పీఆర్సీ నకలు కాపీలను ఉద్యోగ సంఘాలకు పంపుతామని సీఎస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫిట్మెంట్కు, ఐఆర్ కు ఉన్న వ్యత్యాసాన్ని బేరీజు వేసుకున్న తరువాత తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు జేఏసీల నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30 శాతం హెస్ఆర్ఎ, స్థానికులకు 20 శాతం అమలు చేస్తోంది. తెలంగాణలో హెచ్ఎస్ఏ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంపై కూడా ఆ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీ ఏ రకంగా ఉంటుందనేది ఉత్కంఠభరితంగా మారింది.
0 comments:
Post a Comment