ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా వారికి శుభవార్త 11 వ PRC నివేదికను సీఎం గారితో చర్చించి బుధవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని గుర్తింపు సంఘాలకు అందజేస్తామని GAD ప్రిన్సిపాల్ సెక్రెటరీ గారు తెల్పారు.
మొన్న జరిగిన బ్యాంక్ స్టాప్ కౌన్సిల్ సమావేశం నందు సంఘాలు పిఆర్సి నివేదికకు పట్టుబట్టగా బ్రీఫ్ రిపోర్ట్ విడుదల చేశారు పూర్తి నివేదిక అందించాలని సంఘాలు కోరగా రేపు బుధవారం విడుదల చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పిఆర్సి ఉద్యోగులకు మంజూరు చేసి ఉన్నారు..
పత్రికా ప్రకటన
అక్టోబర్ 29న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో PRC నివేదికను వారం రోజులలో ఉద్యోగ సంఘాలకు అందజేస్తామని గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున గౌరవ CS గారిని కలిసి PRC రిపోర్ట్ ను ఉద్యోగ సంఘాలకు అంద చేయవలసిందిగా కోరాము. Joint staff council సమావేశం తర్వాత ఎక్కువ రోజులు సెలవు దినాలు కావడంతో సమావేశంలో చర్చించిన అంశాలను CM గారి దృష్టికి తీసుకెళ్లలేదు. వచ్చే బుధ లేదా గురువారాల్లో CM గారితో చర్చించి ఈ వారంలో PRC నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజేస్తామని CS గారు తెలిపారు.
కే వెంకట రామి రెడ్డి
చైర్మన్
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
0 comments:
Post a Comment