* ఉద్యోగ సంఘాలకు మంత్రి విజ్ఞప్తి
పీఆర్‌సీ విషయంలో సంయమనం పాటించాలని ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.పీఆర్‌సీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు నూతన పీఆర్‌సీ మంజూరు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పుడు వరకు ఐర్ మాత్రమే మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే నూతన పిఆర్సి ప్రకటించినది. ఈ నెలలో జరిగిన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం నందు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పిఆర్సి నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రెండు జేఏసీలు ఉద్యోగుల డిమాండ్ల కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి ఉన్నారు పి ఆర్ సి, డిఎల మంజూరు, సిపిఎస్ రద్దు కోసం ఉద్యమం బాట పట్టక తప్పదని సంఘాలు తెలియజేశారు.
తాజాగా పరిపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ మీద ఉద్యోగ సంఘాలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి
0 comments:
Post a Comment