Press Note:
ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి PRC అమలు గురించి ఉద్యోగుల ఆందోళనను ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. PRC అమలు ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఇంకా ఆలస్యం అవుతున్న కొద్దీ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుందని, వీలైనంత త్వరగా పీఆర్సీని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది.
దానికి స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు PRC ని వెంటనే ఇచ్చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే PRC పై ద్రుష్టి పెట్టి మొత్తం ప్రక్రియను వారం - పది రోజులలో పూర్తి చేయాలని CMO అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ పై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటి అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని త్వరగా ప్రోబేషన్ డిక్లేర్ చేసేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరాము. దీనికి స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబెషన్ డిక్లరేషన్ ను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని CMO అధికారులను ఆదేశించారు.
కాకర్ల వెంకట రామిరెడ్డి
అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం
చైర్మన్
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
0 comments:
Post a Comment