PDF MLCs: ప్రభుత్వ హామీలు తక్షణం అమలు చేయాలి - పిడిఎఫ్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నాడు మరియు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగులకు యిచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్కు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కె.ఎస్. లక్ష్మణరావు, వై. శ్రీనివాసులు రెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు. ఈ రోజు 18.11.2021న శాసనమండలి సమావేశాల సందర్భంగా మంత్రిని కలిసి మాట్లాడారు.
11వ వేతన స్కేళ్ళు తక్షణం అమలు చేయాలని, వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పిన సిపిఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతనం చెల్లించాలని, ఆ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
0 comments:
Post a Comment