జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం - OTS - FAQ ( ప్రశ్న - సమాదానాలు )
ప్రశ్న :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం. రిజిస్టర్డ్ పత్రం యొక్క ప్రయోజనాలు ఏంటి
జవాబు :
1. లబ్ధిదారుడు తన ఇంటిపై freehold /సర్వహక్కులు కల్పించబడును.
2. లబ్ధిదారుడు తన రిజిస్టర్డ్ పత్రం తో బాంకులనుంచి ఋణం పొందుటకు గాని, తనఖా పెట్టుకొనుటకు గాని, అమ్ముకొనుటకుగాని లేదా బాహుమతిగా ఇచ్చుకొనుటకు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు
3. ఈ పథకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయములకు ఏవిధమైన లింకు డాక్యుమెంట్ అవసరంలేదు.
4. లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తి ని గ్రామ సచివాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజేస్ట్రేషన్ కార్యాలయం కు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లవలసిన అవసరంలేదు.
5. లబ్ధిదారుడి స్థిరాస్తిని 22 (ఏ నిభందన నుంచి తొలగించబడుతుంది. దీనివల్ల లబ్దిదారుడు ఏవిధమైన లావాదేవీలైన చేసుకోవచ్చు.
6. రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. నామమాత్రపు రుసుము తో గ్రామ సచివాలయం నందు రిజిస్ట్రేషన్ చేయబడును
ప్రశ్న :
నా ఇల్లును అమ్ముకోనే అవసరము నాకు లేదు. మరి ఈ పట్టా నేను ఎందుకు తీసుకోవాలి.
జవాబు :
ఈ పట్టా తీసుకొనట వలన దశశబ్దాల కాలంగా నివసిస్తున్న ఇంటిపై freehold /సర్వహక్కులు కల్పించబడును మరియు తమ జీవన ప్రమాణాలను ఆర్ధికంగా మెరుగు పర్చుకోవచ్చు. ఇల్లు అమ్ముకోకపోయినా ఈ పట్టాను బ్యాంకులలో తనఖా పెట్టుకొని కుటుంబ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చు. బ్యాంకులలో తనఖా పెట్టుకొనట ద్వారా ఇంటిలోని ముఖ్యమైన అవసరాలకు, ఆరోగ్యపరమైన సమస్యలకు, ఉపాధి అవకాశాలను మెరుగుపచుకోవటానికి ఆర్ధికంగా ఉపయోగపడుతుంది.
ప్రశ్న :
ఈ పథకం యొక్క ప్రయోజనాలను ఉపయోగించుకోకపోతే ఏమి జరుగుతుంది.?
జవాబు :
1. 2014 సంవత్సరంకు ముందు ఇలాంటి పథకము ఒకటి ఉన్నపటికి ఏవిధమైన టైటిల్ డీడ్ (పట్టా )జారీచేయలేదు. ఈ పథకం ద్వారా మొట్టమొదటిసారి పట్టా జారీచేయబడుతోంది.
2.ఋణం పొందిన లబ్దిదారుడు ఋణం చెల్లించని వారీగా మిగిలిపోవడమే కాకుండా ఆర్ధిక సంస్థలనుంచి ఏవిధమైన ఆర్ధిక వెసులుబాటు పొందలేకపోతారు
3. ఈ పథకం వినియోగించుకోకపోవటం వలన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి తీసుకు న్న ఋణమొత్తం పెరిగిపోవడమే కాకుండా అధికామొత్తం చెల్లించాల్సి వస్తుంది.
ప్రశ్న :
గతంలోని ఏకకాల పరిష్కారానికి (ots ప్రస్తుత పథకానికి మధ్య ఉన్న తేడా ఏంటి ?
జవాబు :
1. లబ్ధిదారుడు ఋణం చెల్లించనప్పటికీ ఏవిధమైన రిజిస్టర్డ్ పట్టా ఇచ్చేవారు కాదు.అదేవిధంగా టైటిఎల్ డీడ్ యిచీవారు కాదు. ప్రస్తుత పథకంద్వారా ఋణం చెల్లించిన రశీదు చూపించిన వెంటనే సిరాస్తి సంభందించిన పట్టా ఇవ్వబడుతుంది.
2. గతంలో వడ్డీ ని మాత్రమే మాఫీ చేసేవారు. ప్రస్తుత పథకం ద్వారా ప్రాంతాన్ని బట్టి నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.
3. గతంలో మండల కేంద్రంలోగాల గృహనిర్మాణశాఖ కార్యాలనుకు వెళ్ళివలసి వచ్చేది. ప్రస్తుతం గ్రామ సచివాలయాలలో ఈ పధకం ప్రయోజనం పొందవచ్చు
ప్రశ్న :
ఋణ మొత్తం ఎక్కడ చెల్లించాలి?
జవాబు :
ఈ పద్ధకమకు సంభందించిన మొత్తం పనులన్నీ గ్రామ సచివాలయాలలో నే జరుగుతాయి. లబ్ధిదారులు గుర్తింపు, స్థిరాస్తికి చెందిన కొలతలు, రుసుం చెల్లింపు, ఋణ చెల్లింపు పత్రం, రిజిస్టర్డ్ పత్రం (21.12.2021 నుండి పొందవచ్చు.
ప్రశ్న :
తండ్రి నిర్మించిన ఒక్క ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఈ పధకం ఉపయోగించుకోవచ్చా?
జవాబు :
ఒకే ఇల్లు నిర్మించిన పక్షంలో ఒకే వ్యక్తి లేదా హక్కుదారుడు స్వాధీనంలో ఇల్లు ఉంటే ఈ పథకంద్వారా హక్కు దారులను గుర్తించి పద్ధకాన్ని వర్తింప చేస్తారు. ఒకే స్థలంలో రెండు ఇల్లు నిర్మించుకొని గృహం ఋణం పొందిన వారికి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇద్దరు హక్కు దారులకు పట్టా జారీ చేయడం జరుగుతుంది
0 comments:
Post a Comment