Ministry of Minority Affairs: విద్యార్థి అందించే వివిధ రకాల స్కాలర్షిప్పులు

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (Ministry of Minority Affairs) వారు మైనారిటీల కోసం మూడు స్కాలర్షిప్ పథకాలను ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్-కమ్-మీన్స్ ఆధారిత స్కాలర్షిప్ పథకాలను 100% కేంద్ర నిధులతో అమలు చేస్తున్నారు. ఈ పథకాల కింద భారతదేశంలో ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల/సంస్థ/కళాశాలలో చదువుతున్న ఆరు నోటిఫైడ్ కమ్యూనిటీలకు చెందిన బౌద్ధ, క్రిస్టియన్, జైన్, ముస్లిం, సిక్కు, మరియు జొరాస్ట్రియన్ (పార్శిలు), ఆర్థికంగా బలహీనమైన మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించబడతాయి. '

అర్హతలు:

1. విద్యార్థి/ దరఖాస్తుదారు నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీల విద్యార్థి అయి ఉండాలి(బౌద్ధ, క్రిస్టియన్, జైన్, ముస్లిం, సిక్కు, మరియు జొరాస్ట్రియన్ (పార్శిలు), 

2. దరఖాస్తుదారు భారతదేశంలో ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ విశ్వవిద్యాలయం/కళాశాల/పాఠశాలలో చదువుతూ ఉండాలి. 

3. అభ్యసిస్తున్న కోర్సు కనీసం ఒక సంవత్సరం పాటు ఉండాలి.

4. దరఖాస్తుదారు గత వార్షిక బోర్డ్/క్లాస్ పరీక్షలో 50% మార్కులు సాధించి ఉండాలి.

            మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (Ministry of Minority Affairs) వారి పథకాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కమీషనర్, మైనారిటీల సంక్షేమశాఖ వారిచే అమలు చేస్తున్నారు. మరిన్ని వివరాములకు https://scholarships.gov.in/ సందర్శించండి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top