Medical Reiumbresement:మెడికల్ రేయింబర్సుమెంట్ (MR ) ఆన్లైన్ విధానం

 మెడికల్ రేయింబర్సుమెంట్ (MR ) ఆన్లైన్ విధానం

🌷వైద్య ఖర్చులు 50,000రూ పైబడిన టీచర్లు అందరూ విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🌷ముందుగా మన MR కి సంబంధించిన డిశ్చార్జి సమ్మరీ, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, essentiality సర్టిఫికెట్, డిపెండెంట్ సర్టిఫికెట్ పిడిఎఫ్ ఫార్మాట్ లో 6kb నుండి 1mb సైజు లోపు ఉండేటట్లు స్కాన్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి.

🌷ఇపుడు www.cse. ap. gov. in వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.

🌷ఎడమ వైపు ఉన్న లింక్ లో E-office పై క్లిక్ చేయగానే కుడివైపు MR approvals కనబడుతుంది.దీనిపై క్లిక్ చేయాలి.

🌷వెంటనే స్క్రీన్ పై ఒక బాక్స్ కనబడుతుంది.అందులో యూజర్ name, పాస్స్వర్డ్ మరియు క్యాప్చ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.

🍎యూజర్ name👉టీచర్ పని చేస్తున్న స్కూల్ dise కోడ్.

🌷పాస్స్వర్డ్👉Admin@2818 (first 4 digits in school dise code)

🌷వెంటనే స్కూల్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో MR సెలెక్ట్ చేసుకోవాలి.

🌷వెంటనే ఎంప్లాయ్ టైప్ దగ్గర inservice or pensioner సెలెక్ట్ చేయాలి.

🌷ఇపుడు స్క్రీన్ పై ఎంప్లాయ్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే ఆ స్కూల్లో పనిచేస్తున్న అందరి పేర్లు display అవుతాయి.

🌷ఇపుడు టీచర్ name సెలెక్ట్ చేసుకోవాలి.వెంటనే క్లెయిమ్ ఫారం వస్తుంది.

🌷ఇందులో టీచర్ పేరు, టీచర్ ID NO, ఆధార్ నంబర్, పుట్టినతేదీ, ఫోన్ నెంబర్ డీ ఫాల్ట్ గా ఉంటాయి.

🌷క్లెయిమ్ ఫారం లో స్కూల్ వివరాలు, personal details, అడ్రస్,పేషెంట్ వివరాలు, హాస్పిటల్ వివరాలు పూర్తిచేసి proof in support of claim documents అప్లోడ్ చేయాలి.

🌷 documents లో బిల్ నంబర్, తేదీ లను పూర్తి చేసి డిశ్చార్జ్ సమ్మరీ,essentiality సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, dependent సర్టిఫికెట్ లను అప్లోడ్ చేయాలి.

🌷ఆనంతరం సబ్మిట్ నొక్కాలి.వెంటనే స్క్రీన్ పై successfully అని వస్తుంది.

🌷 దీనిని ప్రింట్ తీసుకొని దానిని DDO ద్వారా MR క్లెయిమ్ దరఖాస్తు కి జతచేసి CSE కి పంపాలి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top