జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యావర్తనములు: విజయనగరం
ప్రస్తుతం : శ్రీమతి ఎన్. సర్య సుధ ఎం.ఏ.బి.ఐడి
లేఖా సంఖ్య,1475/MDM/2019
విషయము:- పాఠశాలవిద్య - విజయనగరం జిల్లా మధ్యాహ్న భోజన పథకం - ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న- మధ్యాహ్న భోజన కార్మికులను విద్యార్థుల నమోదు ప్రకారం అందుబాటులో ఉన్న - ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయు విషయమై మండల విద్యాశాఖాధికారులకు తగు సూచనలు- జారీ చేయుట గూర్చి.
సూచిక:
జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం వారి U.O నేబ్ రేఖా సంఖ్య 2165/ఎ3/బి5/2021.3.16.10.2021.
అప్పటి ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న మరియు ఇప్పుడు ప్రైవేట్ ఆన్ఎయిడెడ్ పాఠశాలలుగా మార్చబడిన మధ్యాహ్న భోజన కార్మికులను విద్యార్థుల నమోదు ప్రకారం అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయవలసినదిగా మరియు ఈ ప్రక్రియలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరూ తొలగించబడకుండా చర్యలు గైకొనవలసినదిగా తెలియజేసియుంటిరి. పై సూచిక లో
కావున జిల్లాలో గల మండల విద్యాశాఖాధికారులందరికీ తెలియజేయునది ఏమనగా! విషయమై G.O.Ms.No. 94, EDUCATION (SE.PROG.I) DEPARTMENT,D: 25.11.2002 మరియు మధ్యాహ్న భోజన పథక నియమ నిబంధనలను అనుసరించి మండల స్థాయిలో మధ్యాహ్న భోజన కార్మికులను సర్దుబాటు చేయవలసినదిగా అనగా 25 మంది విద్యార్థుల వరకు ఒక్కరు 25 నుండి 100 విద్యార్ధుల వరకు ఇద్దరు మరియు వందపైబడి ప్రతీ వంద విద్యార్ధులకు ఒకరు ఉండేటట్లుగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో సర్దుబాటు చేయు నిమిత్తం తగు చర్యగైకొనవలసినదిగా ఆదేశించడమైనది. మరియు సర్దుబాటు చేసిన మధ్యాహ్న భోజన కార్మికులకు సంబందించిన ప్రతి తగు సమాచారం నిమిత్తం ఈ కార్యాలయమునకు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది.
0 comments:
Post a Comment