పెన్షనర్ల డి. ఆర్ -....
సర్వీసులో ఉన్న ఉద్యోగులకు DA (డియర్నెస్ అలవెన్సు) పెన్షనర్లకు DR (డియర్నస్ రిలీఫ్ ) పెరుగుతున్న ధరవరలసూచి (ప్రయిస్ ఇండెక్స్) ఆధారంగా ప్రతీ ఆరునెలలకొకసారి అనగా జనవరి జులై నెలలలో ప్రభుత్వం ప్రకటించాలి.
ఉద్యోగులకు బేసిక్ పే పై DA పర్సంటేజ్ లెక్కించినట్లుగానే మన పెన్షనర్స్ కు కూడా వారి బేసిక్ పెన్షన్ పై DR ఎంత ఇవ్వాలో DR జివో లో ఎనక్సర్ ద్వారా ప్రకటిస్తారు.
ఉద్యోగులకు పి ఆర్ సి లలో స్కేల్స్ నిర్ణయిస్తారు.వారిపే స్కేల్స్ ఆధారంగా పే వార్షిక ఇంక్రిమెంట్ల మంజూరుతో పే పెరుగుతూ ఉంటుంది.,
కానీ పెన్షనర్లకు ప్రత్యేకమైన స్కేల్స్ అనేవి ఉండవు. మనంచేసిన లెక్త్ ఆఫ్ సర్వీసును బట్టి, మరియు మన సర్వీసు చివరి నాటి బేసిక్ పే ను బట్టి పెన్షనర్లకు బేసిక్ పెన్షన్ రిటైర్ అయినపుడే PPO లో నిర్ధారించబడు తుంది. ఈ బేసిక్ పెన్షన్ అనేది బేసిక్ పే లా నిర్ధారించబడి ఉండదు కాబట్టి DR జివోలో ఎనక్సర్ ద్వారా
డి ఆర్ లెక్కించి ప్రకటిస్తారు.
రెగ్యులర్ ఉద్యోగులకు డి ఏ కార్యాలయాధిపతి బిల్లు చేసి ట్రెజరికీ పంపాల్సి ఉంటుంది.
పెన్షనర్లకు డి ఆర్ సంబందిత ట్రెజరీ వారే జివో ప్రకారం లెక్కకట్టి వారి ఖాతాలకు జమచేస్తారు.
ప్రస్తుతం మనకు బకాయి ఉన్న 7 డి ఆర్ లలో 2 డి ఆర్ లను 1/7/18 ,1/1/19 చెల్లింపుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం 98, 51 జివోలను ఇచ్చింది. ఇంకా 5 డి ఆర్ లు 1/7/19 నుండి బకాయి పడ్డాయి. గతంలో ఒకటో రెండో డి ఏ , డి ఆర్ బకాయిలుండేవి. కారణాలు ఏవైనా ఎప్పుడూ లేనివిధంగా ఐదు విడతల డి ఆర్ సంవత్సరాల తరబడి చెల్లించక పోవడమనేది ఇప్పుడే చూస్తున్నాం.
అరియర్స్ గతంలో రెగ్యులర్ ఉద్యోగులకు పి ఎఫ్ ఖాతాలకు పెన్షనర్లకు నగదు రూపంలో ఒకే ధపా చెల్లించేవారు. కానీ ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా జివోలు జారీచేస్తున్నారు.
పెన్షర్స్ కు డి ఆర్ చెల్లింపుకు జీవో ఎంఎస్ నెంబర్ 50 రివైజ్డ్ ఉత్తర్వులను జారీచేసింది.
దీనిననుసరించి పెన్షనర్లకు
1-1 - 2019 నుంచి బకాయి ఉన్న 3.144% డి ఆర్ జూలై 2021 పెన్షన్స్ తోపాటు ఆగష్టు నెలపెన్షన్తో చెల్లించబడింది. ప్రస్తుత డిఆర్ 33.536% గా ఉంది.
1-7 -2019 నుండి బకాయి ఉన్న 5.24 శాతం డీఆర్ జనవరి
2022 నుంచి చెల్లించ బడుతుందని ఇదే ఉత్తర్వులలో తెలియజేయడం జరిగింది. ఏంజరుగుతుందో చూడాలి!!!!
ఈ జీవో ప్రకారం పెన్షనర్స్ డి ఆర్ జూలై పెన్షన్ తో కలిపి ఆగష్టు నెలలో చెల్లించడింది కానీ
1-1- 2019 నుంచి 30-6-20 21 వరకు చెల్లించవలసిన 30 నెలల డి.ఆర్ బకాయిలు మనకు చెల్లించబడలేదు.ఇది మొదటి విడత 1- 7- 2018 నుండి 31- 12 -18 వరకు చెల్లించవలసిన 30నెలల డిఆర్ మూడు వాయిదాల కు అదనం. ఈ బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలని పెన్షనర్లు గా మన డిమాండ్ ....
AP రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించక బకాయిపడ్డ కరువుబత్యం/ రిలీఫ్ వివరాలు..
1/7/19 5.24%
1.1.20 - 3.144%
1.7.20 - 4.186%
1.1.21 - 4.186%
1.7.21
ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కూడా ప్రజలలో భాగమేనని, ప్రజలకిస్తున్న ఎన్నికల హామీలు, సంక్షేమ పధకాలతోపాటు మాకు న్యాయపరంగా ఇవ్వవలసిన కరువు భత్యం కూడా సత్వరం మంజూరు చేసి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్ల డిమాండ్.
కెకెవి నాయుడు. అమలాపురం
9490905356.
0 comments:
Post a Comment