కరవు భత్యం బకాయిల విడుదల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరవు భత్యాన్ని ఏడాదికి 2సార్లు విడుదల చేస్తుందని, దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు కూడా కరవు భత్యాన్ని విడుదల చేస్తుందన్నారు. కొవిడ్ సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3 విడతల కరవుభత్యం, కరవు సాయం చెల్లింపులను స్తంభింపచేస్తూ నవంబరు 6, 2020 జీఓ 95 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment