ఏపీ ప్రభుత్వం తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడారు.వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరామన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరాం. సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పారు. నా చేతుల్లో ఏం లేదు.. సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని శశిభూషణ్ స్పష్టంగా చెప్పారు
0 comments:
Post a Comment