ప్రస్తుతం " జై భీమ్ "సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు సమాజంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను చక్కగా వివరించారు.ఇప్పుడు జై భీమ్
నినాదం బహుళ ప్రజాదరణ పొందుతుంది.
అంబేద్కర్ వాదులు ఒకరినొకరు పలకరించుకోవడానికి జై భీం అనడం పరిపాటి.స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అనేక నినాదాలు పౌరుల్లో దేశభక్తిని పెంచాయి.వాటిల్లో జై హింద్ ఒకటి.నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ నినాదాన్ని విరివిగా ఉపయోగించారు.అయితే జై హింద్ అనే పదాన్ని అబిద్ హసన్ అనే నేతాజీ అనుచరుడు సృష్టించారు.తొలుత ఈ పదాన్ని భారత దేశానికి విజయం కలగాలి అనే అర్థంలో ఉపయోగించేవారు.తర్వాత దేశానికి వందనం అనే అర్థం వచ్చేవిధంగా ఉపయోగిస్తున్నారు.
జై భీం నినాదం అంబేద్కర్ జీవితంతో ముడిపడి వున్నప్పటికీ, ఈ నినాదాన్ని ఆయన అనుచరుడు బాబు ఎల్ ఎన్ హార్దస్ సృష్టించారు.
హార్దస్ 1904 జనవరి 6న జన్మించారు. ఆయన మంచి రచయిత. చిన్నతనం నుంచే సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలని రూపుమాపేందుకు కృషి చేశారు. ఆయన 1928లో అంబేద్కర్ ని కలుసుకున్నారు. ఆయన విగ్రహారాధనని ఖండించారు.
ఆయన ఇండిపెండెంట్ రిపబ్లిక్ పార్టీలో చురుగ్గా వున్నారు.పార్టీ
సభ్యులు ఒకరినొకరు పలకరించుకోవడానికి ఏదైనా మంచి పదం ఉంటే బావుంటుందని ఆలోచించి జై
భీమ్ ఉపయోగించారు.ఈ నినాదాన్ని ఆయన 1936లో ఉపయోగించారు.జై భీమ్ నినాదానికి చీకట్లో నుంచి వెలుగులోకి రావడం, అంబేద్కర్ కి విజయం కలగాలి
అనే అర్థంలో ఉపయోగించేవారు.ప్రస్తుతం జై భీం పదాన్ని అంబేద్కర్ వాదులు ఒకరినొకరు పలకరించుకోవడానికి ఉపయోగిస్తున్నారు.
హార్దస్ 1939 జనవరి 12న తుదిశ్వాస విడిచారు.జై భీం కేవలం ఒక నినాదం మాత్రమే కాదు,అణగారిన వర్గాల వారి హక్కుల సాధనకు ఒక అక్షర ఆయుధంగా ఉపకరిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836
0 comments:
Post a Comment