ఇప్పుడు వరకు వెలుగులోకి వచ్చినకోవిడ్‌ వేరియంట్లకు పేర్లు

 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎన్ని కోవిడ్‌ వేరియంట్లకు పేర్లు పెంట్టిందో తెలుసుకుందాం.

ఆల్ఫా: యూకేలోని కెంట్‌లో తొలిసారిగా 2020 సెప్టెంబర్‌లో గుర్తించారు. బ్రిటన్‌లో సెకండ్‌వేవ్‌ ఈ వేరియెంట్‌తోనే విజృంభించింది.

బీటా: దక్షిణాఫ్రికాలో 2020 మేలో గుర్తించారు. ప్రపంచ దేశాల్లో 50% కేసుల్ని ఈ వేరియెంట్‌ పెంచింది.

గామా: బ్రెజిల్‌లో నవంబర్‌ 2020లో గుర్తించారు. దక్షిణ అమెరికాలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది

డెల్టా: భారత్‌లో అక్టోబర్‌ 2020లో ఈ వైరస్‌ మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆసియా, యూరప్‌లో విజృంభించింది. ఇప్పటివరకు వచ్చిన వేరియెంట్‌లలో ఇదే అత్యంత వేగంగా విస్తరించింది. ఆల్ఫా కంటే 60% వేగంగా వ్యాప్తి చెందింది.

ఈటా: డిసెంబర్‌ 2020లో యూకేలో తొలిసారిగా బయటపడిన ఈ రకం 72 దేశాలకు విస్తరించింది.

లోటా: న్యూయార్క్‌లో 2020లో బయటపడిన ఈ వేరియెంట్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు

కప్పా: భారత్‌లో అక్టోబర్‌ 2020లో వెలుగు చూసిన కప్పా వేరియెంట్‌ కేసులు 55 దేశాల్లో వెలుగులోకి వచ్చాయి

లాంబ్డా: డిసెంబర్‌ 2020లో పెరూలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వేరియెంట్‌ మూడు నెలల్లోనే 41 దేశాలకు విస్తరించింది.

ఒమిక్రాన్‌: నవంబర్లో వెలుగులోకి వచ్చింది

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top