*2 నుంచి 18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు
ఆంధ్ర టీచర్స్ (నవంబర్ 6 ) భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తున్న కోవాగ్జిన్ ను ఇతర దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ భారతీయ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, అగ్రరాజ్యం అమెరికాలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. 2-18 ఏళ్లులోపు వారికి కూడా కోవాగ్జిన్ తయారు చేసింది భారత్ బయోటెక్.. పిల్లలకు కోవాగ్జిన్ టీకా వేయడానికి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినా.. ఇక, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి ఆమోదం లభించలేదు.. కానీ, కోవాగ్జిన్ వాడేందుకు అనుమతులు కోరుతూ అమెరికాలో కూడా దరఖాస్తులు నమోదైంది.. అమెరికాలో 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు కోరుతూ ఓక్యుజెన్ అనే కంపెనీ దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.
0 comments:
Post a Comment