*విద్యార్థులకు చదువు చెప్పడమే ముఖ్యమైన అంశం
ఆంధ్ర టీచర్స్ ( నవంబర్ 6 )వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని పాఠశా లలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు పాఠ శాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరి బి. రాజశేఖర్ తెలిపారు. తెనాలి మండలం కొలకలూరులోని జెడ్పీ హైస్కూల్న పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరి బిరాజశేఖర్, కమిష నర్ వి.చినవీరభద్రుడు, అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించింది. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావే శంలో రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పడమే ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయులు తీసుకో వాలని సూచించారు. సిలబస్ పూర్తి చేయడం ముఖ్యం కాదని, విద్యార్థులకు చదవడం, రాయడం, అర్ధమ య్యేలా బోధించడం ముఖ్యమన్నారు.
0 comments:
Post a Comment