Questions & Answers సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:

వేసవి సెలవుల్లో ముందు రోజు బడికి వెళ్ళాను. సెలవులు అనంతరం ప్రారంభం రోజు బడికి వెళ్లలేకపోతే ఏ విధమైన సెలవు పెట్టుకోవచ్చు??

జవాబు:

Ldis. no.1933 , తేదీ:30.3.84 ప్రకారం అర్ధజీతపు, కమ్యూటెడ్, సంపాధిత, జీతనష్టం సెలవులను మాత్రమే వాడుకోవాలి.

ప్రశ్న:

ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి??

జవాబు:

జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.7.75 ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు.

ప్రశ్న:

ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా??

జవాబు:

సర్వీసు లో ఉండి ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.

ప్రశ్న:

ఒక SGT వేరే DSC లో SA గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా?అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా??జవాబు:

మీరు పై అధికారి అనుమతి తో Relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి మాత్రం రక్షణ ఉండదు. SA గా చేరిన సంవత్సరం నకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు.

ప్రశ్న:

నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను. పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా??

జవాబు:

పెన్షన్ ను ఆదాయం గా చూపాలి. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.

ప్రశ్న:

నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీ లు వేయలేదు.ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి??

జవాబు:

సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.

ప్రశ్న:

నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను.నేను ఆ ఉద్యోగం లో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా??

జవాబు:

జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టు లో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది.అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రశ్న:

బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా??

జవాబు:

6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.

ప్రశ్న:

నేను జీత నష్టపు సెలవు పెట్టి M. ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను??

జవాబు:

జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్,AAS స్కేల్స్ వాయిదా పడతాయి.3 ఇయర్స్ పైన జీత నష్టపు సెలవు కాలం పెన్షన్ కి అర్హ దాయక సర్వీస్ గా పరిగణింపబడదు.

ప్రశ్న

నేను జూన్ 30 న రిటైర్మెంట్ అవుతున్నాను.నేను ఎన్ని సెలవులు వాడుకోవచ్చు??

జవాబు:

మొత్తం 22 CLs వాడుకోవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top