అమరావతి,28 నవంబరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా డిసెంబరు 1వ తేదీ నుండి 2022 మే 31 వరకూ పొడిగించింది.1985 వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన డా.శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఎస్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాల్సిందిగా ఈనెల 2న కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయడం జరిగింది.అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సిఎస్ పదవీకాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.ఈమేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ (డిఓపిటి)అండర్ సెక్రటరీ కులదీప్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆదేశాలు జారీచేశారు.
(ప్రచార విభాగం సమాచార శాఖ అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)
0 comments:
Post a Comment