వైద్య విద్యలో చేరేందుకు విద్యార్థులు ఎదురు చూస్తున్న నీట్ స్టేట్ ర్యాంకులు మంగళవారం వెలువడనున్నాయని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. నీట్ బోర్డు నుంచి రాష్ట్ర ర్యాంకుల వివరాలు సోమవారం రాత్రికి యూనివర్సి టీకి రానున్నాయి. వాటిని క్రోడీకరించి మంగ ళవారం మధ్యాహ్నం 12 గంటలకు స్టేట్ ర్యాంకులను వర్సిటీ వెబ్సైట్లో పొందుప రచనున్నారు. ఆ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనున్నారు. నీట్ ఫలితాలు వెల్లడించి 20 రోజులు కావస్తుండగా, కొన్ని సాంకేతిక పరమైన అంశాలతో స్టేట్ ర్యాంకులు ప్రకటించడంలో జాప్యం జరిగిం ది. ప్రస్తుతం స్టేట్ ర్యాంకులు ప్రకటి స్తుండటంతో ఇక అడ్మిషన్ల ప్రక్రియకు త్వర లోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment