మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం - ఏపీ హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ - రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి నివేదించిన అడ్వకేట్ జనరల్ - తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకి వాయిదా వేసిన ధర్మాసనం - వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసింది - చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేస్తారు : అడ్వకేట్ జనరల్
ఏపీ హైకోర్టులో ఈ చట్టాల మీద విచారణ సాగుతోంది. అనేక మంది అభ్యంతరాలు వేస్తూ పిటీషన్లు వేయడంతో నవంబర్ 15 నుంచి రోజువారీ విచారణ ప్రారంభమయ్యింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఆసక్తిగా మారింది
ఈ చట్టాన్ని కొన్ని సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తొలుత పాత చట్టాన్ని రద్దు చేస్తూ ఓ బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది.
ఏపీ క్యాబినెట్ ఈ అంశంపై అత్యవసర భేటీలో చర్చిస్తోంది. ఆ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు చెబుతున్నారు. డిసెంబర్ 19 , 2019లో మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు.
మూడు రాజధానుల బిల్లును తొలుత 2020 జనవరి 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఆ తర్వాత 2020 జూన్ 16న రెండోసారి కూడా శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది. కానీ శాసనమండలి ఈ బిల్లును ఆమోదించలేదు. మండలి చైర్మన్ తన విశిష్ట అధికారాలను ఉపయోగిస్తూ.. ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీలకు పంపించారు. కానీ అప్పట్లో ఆ కమిటీలేవీ ఏర్పాటు కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. రాజ్యాంగంలోని 197 (1), (2) అధికరణల కింద ఈ బిల్లును 2020 జూలై నెలలో గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31న దీనిని ఆమోదించటంతో ఈ బిల్లు చట్టంగా మారింది.
దీనిపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. కోర్టులో విచారణ సాగుతోంది.
0 comments:
Post a Comment