*'ఎవరు మీలో కోటీశ్వరులు' విజేత భాస్కర్ రాజా రవీంద్ర
ఆయన ప్రజ్ఞకు కోటి రూపాయలు దాసోహమ య్యాయి. భద్రాది కొత్తగూడెం జిల్లా సుజాత నగర్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రాజారవీంద్ర ఓ తెలుగు టీవీ చానల్‌లో జూని యర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో అడిగిన 15 ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్నారు.
అనుకోకుండానే కార్యక్రమానికి హాజరై చరిత్ర సృష్టించిన ఈ కోటీశ్వరుడు సోమవారం రాత్రి 8:30 గంటలకు టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో చెక్కు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మిగతా సగం మంగళవారం ప్రసారం కానుంది. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు.
2000 - 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఇదివరకు సాఫ్ట్‌వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్ క్రైంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర పిస్టల్, ఎయిర్ రైఫిలింగ్‌లోనూ దిట్ట
0 comments:
Post a Comment