ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతో... ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యమయ్యాయి. జేఏసీ పేరుతో యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం కూడా కాస్త దిగివచ్చింది. ఉద్యోగులతో చర్చలకు రెడీ అయ్యింది. గత నెలాఖరులోపే పీఆర్‌సీ నివేదిక ఇస్తామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ మాత్రం అమలు కాలేదు. పైగా ఇప్పటి వరకు కనీసం పీఆర్‌సీ నివేదిక కూడా ఇవ్వలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. చివరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌ను కూడా 9 సంఘాల నేతలు బహిష్కరించాయి. అసలు ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు కూడా ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఈ నెలాఖరు లోపు పీఆర్‌సీ తేల్చాల్సిందే అంటూ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు ఉద్యోగులు. ఇదే విషయాన్ని జేఏసీ నేత బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు తర్వాత... ప్రభుత్వంపై తమ పోరాటం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment