ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణకు నోడల్ అధికారి నియామకం
ఉద్యోగ సంఘాలతో రేపు మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరగనుంది. పీఆర్‌సీ నివేదిక, అమలు, ఫిట్‌మెంట్, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, వాటి పరిష్కారంపై భేటీలో చర్చించనున్నారు. పీఆర్‌సీ అమలు విషయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో మరోసారి భేటీ కావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞప్తులను స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిని నియమించింది. ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నోడల్ అధికారిగా నియమించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు నోడల్ అధికారిని నియమించింది. ఈ మేరకు నోడల్ అధికారిగా ఆదినారాయణను నియమిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు
0 comments:
Post a Comment