ULB Education Cell Constituted in the ULBS Certain Municipal Teachers issues pending Certain instruction issued Roc.No.1212953 Dt: 18.10.2021.
ULB ఎడ్యుకేషన్ సెల్ ల ఏర్పాటు.
👉 *SR లు అప్ డేట్ కాక పోవటం, జీతాల బిల్లులు, ఎరియర్ బిల్లులు, లీవ్ ఎంట్రీలు తదితర సర్వీసుకు సంబంధించిన అన్ని విషయాలు చాలా చాలా ఆలస్యం అవుతున్న కారణంగా, మరియు చాలా సమస్యలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంటున్న నేపధ్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రతి ulb లో ఒక ఎడ్యుకేషన్ సెల్ ను ఏర్పాటు చేస్తూ DMA వారి ఉత్తర్వులు విడుదలయ్యాయి.
👉 ఈ ULB ఎడ్యుకేషన్ సెల్ లో మేనేజర్,సీనియర్ హెడ్ మాస్టర్, సూపర్ వైజర్లు, పాఠశాల ల సంఖ్య ఆధారంగా ముగ్గురు వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఉంటారు.
👉 ఉపాధ్యాయులకు సంబంధించిన PF. ఎకౌంట్ లు, సర్వీస్ రిజిస్టర్ సమస్యలు, ESR పూర్తి,పెండింగ్ PRC ఎరియర్ బిల్లులు, లీవ్ మంజూరు సమస్యలు, నాడు-నేడు, School ERP, రెమిడియల్ టీచింగ్...Etc అనగా ఉపాధ్యాయులు సర్వీసుకు సంబంధించిన అన్ని రకాల సమస్యల పరిష్కారం బాధ్యత వీరిదే.
👉 ఈ విషయంలో RDMAలు కమీషనర్ లకు మార్గనిర్దేశం చేయాలని DMA ఉత్తర్వులు విడుదల చేశారు
మున్సిపల్ స్కూల్స్ లో అదనపు తరగతి గదులు మంజూరు:
👉నాడు-నేడు కింద ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 లలో సెలెక్ట్ కాబడిన మున్సిపల్ పాఠశాల లలో NEP 2020 క్రింద అదనపు తరగతి గదులు మంజూరు చేయబడినవి.
👉ఈ రెండు ఫేజ్ లకు సెలెక్ట్ కాని పాఠశాల లలో సైతం ఈ సంవత్సరం ఎన్ రోల్ మెంట్ అధికంగా ఉన్న నేపథ్యంలో అదనపు తరగతి గదులు నిర్మాణం జరగవలసి ఉంది.
👉దీని కోసం మున్సిపల్ కమిషనర్ లు మున్సిపల్ స్కూల్స్ ను సందర్శించి వెంటనే చర్యలు చేపట్టాలని, స్థలం లేకపోతే G+1 విధానంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఉపక్రమించాలని, మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి నిధులు ఖర్చు చేయాలని, ఈ విషయంలో RDMAలు మున్సిపల్ కమీషనర్ లకు దిశానిర్దేశం చేయాలని DMA ఉత్తర్వులు విడుదల చేశారు.
0 comments:
Post a Comment