Pay Fixation on Promotion: Fundamental Rules Promotion Pay Fixation for State Govt Employees Pay Fixation on Promotion for State Govt Employees Option for Pay Fixation Promotion Pay Fixation F.R .22(a) (i) F.R 22(a) (ii) F.R 22(a) (iii) F.R(a) (iv) F.R 22 B, F.R 31 92), F.R 26, F.R 27, F.R 24 ఫండమెంటల్ రూల్సు - ఫిక్సేషన్లు, ఇంక్రిమెంట్లు
ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడినప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22,30,31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్ (గ్రేడు, | 6/12/18/24 సంవత్సరముల స్కేల్సు, రివైజ్ పే స్కేల్సు, మొ||వానియందు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయ బడుచున్నది.
అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు, ఫ్రీపోన్మెంటు పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్ రూల్పు 24, 26, 27 ననుసరించి చేయబడతాయి.
Pay Fixation on Promotion: Fundamental Rules
F.R.22(a) (i) :
అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి "తదుపరి 3 వద్ద వేతన స్థిరీకరణ జరుగును. అట్టి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
ఉదా : 21,230-63,010 స్కేలులో రూ.25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940 78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ.28,940గా స్థిరీకరించబడుతుంది. F.R.22(a) (ii) : అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి 'దిగువ స్టేజి' వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే -
ఎ)ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచో అట్టి 'సమాన స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.బి) ఒకవేళ పాత స్కేలులోని మూలవేతనమునకు సమానమైన స్టేజి లేనిచో దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన వ్యత్యాసము 'పర్సనల్ పే'గా నమోదు చేయబడుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది. (93,99,05,10,15 స్కేళ్ళలో అన్నీ సమాన స్టేజీలే వుంటాయి. కనుక 86 స్కేళ్ళలో ఉదా॥ చూడాలి)
ఉదా : 1010-1800 స్కేలులో రూ. 1360/-లు పొందుచున్నచో 1280-2440 స్కేలులో రూ.1330+30 పిపిగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.
సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే. ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది. ఉదా : రూ.21,230-63,010 స్కేలులో రూ. 25,840/-లు పొందుచున్నచో, 28,940- 78,910 స్కేలులో రూ.28,940/- వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది.
F.R.22(a) (III) :
ఉద్యోగి కోరికపై క్రింది స్థాయి పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము ఎఫ్ఆర్ 22(ఎ) (iii) లోని విధానము ననుసరించి స్థిరీకరించబడుతుంది. | E.R.22(a) (iv) : ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్డ్చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించ బడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.
FR 22(a)(iv)
ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించ బడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.
F.R.22 B
నిబంధన ననుసరించి వేతన స్థిరీకరణ రెండు విధములుగా చేయవచ్చును. వాస్తవ ప్రమోషన్స్ తేదీనాడైనను లేక ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటు తేదీనాడైనను వేతన స్థిరీకరణ చేయవచ్చును. జిఓ.. ఎంఎస్.నం. 145, తేది. 19,05, 2009 ప్రకారము | ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను. 1,063,010 స్కేలులో రూ.28,120/-లు వేతనం పొందుతూ పదోన్నతి పొందినచో పదోన్నతి పొందిన రోజున వేతనం రూ. 28,940/-లుగా ఎస్ఆర్ 22ఎ(1) ప్రకారం నిర్ణయించి తదుపరి ఇంక్రిమెంటు తేదీ నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు రూ.820/-లు కలిపి వేతనాన్ని రూ.28,940-78,910 స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా రూ.30,580/-లుగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.
FR 31(2):
నిబంధన ఎస్ఆర్ 22కు అనుబంధమైనది. దీని ప్రకారం సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగి వుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము . తదుపరి పై స్టేజి వద్ద పున్దస్థిరీకరణ చేయబడుతుంది. లాభకరమైనప్పుడు).
ఉదా : 21.230-63,010 స్కేలులో రూ.30,580/-లు పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940-78,910 స్కేలులో రూ.31,460/-ల వద్ద స్థిరీకరణ జరుగుతుంది. అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము రూ.31,460/-లుగా పెరుగుతుంది. కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని వేతనము 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయ బడుతుంది.
F.R 26
2. నిబంధన ననుసరించి వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయబడును. వార్షిక ఇంక్రిమెంటు మంజూరుకు - ఒక పోస్టులోని డ్యూటీ కాలము, జీత నష్టములేని సెలవు కాలము, ఫారిన్ సర్వీసు కాలము, జాయినింగ్ కాలము మొదలగునవి లెక్కించబడతాయి. అనారోగ్యం కారణముపైగాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యనసభ్యసించు కారణముపైగాని పెట్టిన జీతనష్టపు సెలవు 6 నెలల కాలపరిమితికి లోబడి ఇంక్రిమెంటుకు పరిగణించబడుతుంది. అందుకుగాను సంబంధిత శాఖాధిపతి అనుమతిని పొందవలసి వుంటుంది. శిక్షా చర్యగా సస్పెండు చేయబడిన కాలము ఇంక్రిమెంటుకు లెక్కించబడదు.
F.R 27
నిబంధన ననుసరించి జూనియర్కంటే సీనియర్ తక్కువ వేతనము పొందుచున్న సందర్భములో - ప్రీమెచ్యూర్ ఇంక్రిమెంట్ (ఫ్రీఫోన్మెంట్) మంజూరు చేయబడుతుంది. ఒక పోస్టును మంజూరు చేయు అధికారియే అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయు అధికారము గలిగి యుండును. అయితే ప్రభుత్వపు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సదరు అధికారము దఖలు పరచబడిన సందర్భములో సంబంధిత క్రింది. అధికారులు కూడా అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయవచ్చును. ఫ్రీపోన్మెంట్తోపాటు స్టెప్పింగ్ అప్ కూడా యీ నిబంధన క్రిందే చేయబడుతుంది.
F.R 24
నిబంధన ననుసరించి దుష్ప్రవర్తన గల లేక అసంతృప్తికరమైన విధముగా విధులను నిర్వహించుచున్నద్ధి ఉద్యోగిపై శిక్షా చర్యగా ఇంక్రిమెంటును కొంత కాలము నిలుపు చేయవచ్చును. ఇంక్రిమెంటు మంజూరు చేయు అధికారియే అట్టి నిలుపుదల చేయవచ్చును. రెండు విధములు- 1, క్యుములేటివ్ ఎఫెక్టుతో అనగా ప్రతి సంవత్సరము నిర్ణీత కాలము | పడుతుంది. 2. క్యుములేటివ్ ఎఫెక్టు లేకుండా అనగా ఆ ఒక్క సంవత్సరమునకు మాత్రమే నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.
0 comments:
Post a Comment