సుమారు 12 సం||ల తర్వాత ఈ రోజు (29.10.2021) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇదే తొలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, 7. శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘాలు, 6 సంఘాలు రొటేషన్ ప్రాతిపదికన మొత్తం 13 సంఘాలు హాజరయ్యాయి. సమావేశం ప్రారంభంలోనే ఏపి జెషన్ ఛైర్మన్ పిఆర్సి నివేదిక బహిర్గతం పరచాలని పట్టుబట్టారు. కాని, ప్రభుత్వం ఒక నోట్ మాత్రం ఇచ్చింది, పూర్తి నివేదిక 4,5 రోజుల్లో ఇస్తామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్ శర్మ హామీ ఇచ్చిన తర్వాత సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో మనం అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది.
సమావేశం ముఖ్యాంశాలు - ప్రాతినిధ్యాలు:
1. PRCరిపోర్టు, డిఏలు : PRC కమీషన్ 23% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పిందని, ప్రభుత్వం 27% ఐ.5. ఇస్తుంది కాబట్టి 27% ఫిట్మెంట్ ప్రతిపాదిస్తూ ఒక నోట్ ఇచ్చారు. దానిలో పిఆరి ఎప్పటినుండి అమలు చేస్తారని, ఇతర ప్రయోజనాలు ఏమిటని గాని పేర్కొనలేదు. ప్రభుత్వానికి అయ్యే ఖర్చు మాత్రం చూపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సందర్భంగానైనా పికారి రిపోర్టు విడుదల చేస్తారని ఉద్యోగులు, ఉపాధ్యా యులు ఎదురు చూస్తున్నారని, పిఆర్ని రిపోర్టు ఒక్క ఫిట్మెంటికే పరిమితం కాదని చెప్పాము. సర్వీస్ కండిషన్స్, పెన్షనరీ బెనిఫిట్స్, అలవెన్సులు, సెలవులు మొ|| విషయాలన్ని రిపోర్టులో ఉంటాయి కనుక తప్పనిసరిగా సమావేశం ముగిసే లోపల సాఫ్ట్ కాపీ సంఘాలకు ఇవ్వాలని డిమాండ్ చేసాము, పిఆర్సి కమిటీతో మాట్లాడి ఒక వారం రోజుల లోపల పిఆర్ రిపోర్టు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చెప్పారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 2 దీఏలకు సంబంధించి అరియర్లు ఇవ్వలేదని, అరియర్లు ఇవ్వకుండానే ఇన్-కం-టాక్స్ మాత్రం తగ్గించుకున్నారని, ఇంకా 5 డిలు పెండింగ్లో వున్నాయని ప్రభుత్వం వెంటనే పెండింగ్ డిఎలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేసాము.
2. సిపిఎస్ రద్దు
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పటివరకు ఏ విధమైన నిర్ణయం ప్రకటించకపోవడంతో సిపిఎస్ ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పాము. వెంటనే సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని కోరాము. దీనితోబాటు కేంద్ర ప్రభుత్వం 31.12.2013కు ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని ఇచ్చిన ఉత్తర్వులు OM.F.No.FX-162021-PR section, dt. 09.08.2021 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేస్తూ డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు, పోలీసులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరాము, ఇది ఫైనాన్స్లో పెండింగ్లో ఉందని వెంటనే క్లియర్ చేయాలని కోరాము. కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు తన వాటా 10% నుండి 14%నికి పెంచిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా 14 %నికి పెంచుతూ 01.04.2019 నుండి ఉద్యోగుల ఖాతాలకు జమ చేయాలని కోరాము. అలాగే మార్చి 2021 నుండి జమకాని ప్రభుత్వ వాటాను వెంటనే సిపిఎస్ ఉద్యోగులకు జమ చేయాలని కోరాము..
3. ఆర్థిక శాఖలో పెండింగ్ సమస్యలు :
1. డిఎసి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం, మున్సిపల్ ఉపాధ్యాయులకు రూ.398/- నోషనల్ ఇంక్రిమెంట్లు, సంక్షేమ ఉపాధ్యాయులకు పండిట్, పిఇటి పోస్టుల అప్డేడేషన్, సిఆర్ టిల రెన్యూవల్ వంటి ముఖ్యమైన సమస్యలన్నీ ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వని కారణంగా పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దృష్టికి తెచ్చాము. ఈ సందర్భంగా సిఆర్దిల రెన్యూవల్ ఫైల్ అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలియజేసారు.
2. ఎపిజిఎల్ఎస్ఐ, పిఎఫ్, సరండర్ లీవు, అర్థబీతపు సెలవులు, మెడికల్ రీయింబర్మెంట్, బిల్స్ ఆర్థిక శాఖ సకాలంలో విడుదల చేయడం లేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అధికారుల దృష్టికి
3. అలాగే సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ వల్ల ఎదురౌతున్న ఇబ్బందులను చెప్పాము, ముఖ్యంగా ఉపాధ్యాయుల పొజిషన్ ఐడిల సమస్యను వివరించాము. గడిచిన 8 నెలలుగా జీతాలు లేని ఉపాధ్యాయుల గురించి ప్రస్తావన చేసాము. - ఆర్థిక శాఖ అధికారుల వల్ల కలుగుతున్న ఇబ్బందులపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి స్పందిస్తూ ప్రతి సంఘంతోనూ సమావేశమై వారి సమస్యలన్నీ పరిష్కరించాలని ఆర్థిక ముఖ్య కార్యదర్శి రావత్ గారిని ఆదేశించారు.
4. కారుణ్య నియామకాలు:
కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలలోనూ సుమారు 1000 మంది పైగా ఉపాధ్యాయులు మరణించారని, అట్లాగే మరొక 2000 వరకు ఉద్యోగులు, కార్మికులు మరణించారని, వీరందరికీ నవంబర్ 30లోగా కారుణ్య నియామకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని, కాని, అంతకు రెండు సంవత్సరాలకు ముందే మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇంతవరకు కారుణ నియామకాలు జరపలేదని, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దృష్టికి తెచ్చాము. ఏ.డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్ మెంట్లో నే కారుణ నియామకం జరపాలన్న ఉత్తర్వులు ఉన్నందున ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని, కాబట్టి డిపార్ట్మెంట్ బేదం లేకుండా కారుణ్య నియామకాలు జరపాలని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి నియామకాలు జరపాలని కోరాము.
5. ప్రాథమిక పాఠశాలల విభజన
నవంబర్ 1వ తేదీ నుండి హైస్కూల్స్కు 250 మీ||ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులు విడగొట్టి హైస్కూల్స్ లో విలీనం చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చిందని, దీనివల్ల దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రాథమిక విద్యా వ్యవస్థ కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పాము. 1,2 తరగతులను విడగొట్టకుండా, 1 నుండి 5 తరగతులు అదే హైస్కూల్లో నిర్వహించాలని కోరాము. అలాగే ప్రతి హైస్కూల్కు 3,4,5 తరగతులు చేరుతున్నందున కొత్తగా తరగతి గదులు మంజూరు చేసారని, అవి పూర్తి కాకుండానే 3,4,5 తరగతులు హైస్కూల్ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఉపాధ్యాయులు ఇటూ తిరగవలసిన పరిస్థితులు ఏర్పడతాయని, గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి తరగతి గదుల నిర్మాణం అయ్యేవరకైనా ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరాము.
6.యాప్ ల గురించి
ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పాలో, టాయిలెట్లు ఎలా శుభ్రపరచాలో, భోజనాలు ఏ రకంగా ఫోటోలు తీయాలో, నెట్వర్క్ లేనిచోట యాప్లు ఎలా అప్లోడ్ చేయాలో తెలియక ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంకంటే యాప్ల అప్లోడ్ చేయడానికే కాలం సరిపోతోందని చెప్పాము. అటెండెన్స్ ఇప్పటికే రెండుసార్లు నమోదు చేస్తున్నారని, ఇది చాలరన్నట్లు కొత్తగా బయోమెట్రిక్ ప్రవేశ పెట్టారని, జగనన్న విద్యా కిట్లు, డ్రై రేషన్, కోడిగుడ్లు, చిక్కిలు ఇలా ప్రతిదానికి తల్లులను పాఠశాలలకు రప్పించి బయో మెట్రిక్ వేయిస్తున్నారని. చెప్పాము. రాష్ట్రంలో 9వేల సింగిల్ టీచర్స్ స్కూల్స్ ఉన్నాయని, ఇక్కడ పాఠాలే చెప్పాలో, యాప్టీ అప్లోడ్ చేయాలో తెలియడం లేదు. అధికారుల దృష్టికి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాము సులభతరం చేస్తామన్నారు. చేయకపోగా రోజురోజుకి కొత్త కొత్త యాప్లు తీసుకొస్తున్నారు. కాబట్టి భారంగా మారిన యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేసాము.
7. పాఠశాల విద్య సమస్యలు :
1. కొత్తగా అప్డ్ చేసిన హైస్కూల్కు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి ఎంఇఓ, డివైఇఓ ఖాళీలు భర్తీ చేయాలని, పొజిషన్ ఐడిల సమస్య పరిష్కారం చేయాలని కోరాము,
2. అంతర్ జిల్లా బదిలీలకు సుమారు 450మంది దరఖాస్తు చేసుకున్నారని, వెంటనే వారి బదిలీలు అమలు చేయాలని కోరాము, స్పౌజ్ మరియు మ్యూచువల్ కేటగిరీలకు చెందని ఉపాధ్యాయులకు వన్లైం సెటిల్మెంట్ అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరాము. అట్లే అంతర్రాష్ట్ర బదిలీలకు ఒక విద్యాశాఖ తప్ప మిగిలిని డిపార్ట్ మెంట్లు అన్ని అనుమతి మంజూరు చేసాయని, విద్యాశాఖ కూడా వెంటనే అనుమతి ఇవ్వాలని కోరాము. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే వారికి అనుమతి సుంజూరు చేయాలని కోరాము.
3. ఎయిడెడ్ మేనేజ్ మెంట్ల అనుమతితో ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వం వారిని తిరిగి అప్పగిస్తామని ప్రకటనలు చేస్తోందని, దీనితో ఎయిడెడ్ ఉపాధ్యాయుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్నదని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దృష్టికి తెచ్చాము. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా వారికి ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం లేదని అందుకే వారు ప్రభుత్వంలో విలీనం కావాలనుకుంటున్నారని, కాబట్టి వారి సమస్యను సానుభూతితో పరిశీలించి నవంబర్ 7వ తేదీన కౌన్సిలింగ్ జరిపి సాధ్యమైనంత దగ్గరగా పోస్టింగ్లు ఇవ్వాలని కోరాము.
ఉద్యమ అభినందనలతో KSS ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి, APUTF ఆంధ్ర ప్రదేశ్.....
0 comments:
Post a Comment