మరో వారంలో ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్' విడుదల కానున్న విషయం తెలిసిందే. జియో- గూగుల్ సంయుక్తంగా రూరల్ ఏరియాల్ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను విడుదల చేయడంపై వినియోగదారులు ఈ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక‍్తి చూపిస్తున్నారు. అయితే వారి ఆసక్తిని రెట్టింపు చేస్తూ తక్కువ డౌన్ పేమెంట్తో పాటు కేవలం రూ.300 నెలవారీ ఈఎంఐని చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ ఫోన్ ఈఐఎంఐతో పాటు వాయిస్ కాల్స్, డేటా వివరాల గురించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా వెల్లడించారు.
జియో వివరాలు:
▪️ప్రకారంభారత్‌లో విడుదల చేయనున్న 4జీ జియో ఫోన్ నెక్ట్స్‌ను జియో సంస్థ కేవలం రూ.1,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది.
▪️మిగిలిన మొత్తాన్ని 18 నెలలు లేదంటే 24 నెలల కాల వ్యవధిలో చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది.
▪️మన దేశంలో జియో ఫోన్ ధర రూ.6,499గా నిర్ణయించింది.
▪️కస్టమర్లు బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.1,999 ను డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
▪️ మిగిలిన మొత్తాన్ని 18-24 నెలల్లోగా పే చేయాలి. ఇందుకోసం జియో నాలుగు ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది.
జియో ఫోన్ నెక్ట్స్ : కస్టమర్ల కోసం నాలుగు ప్లాన్లు
మొదటి ప్లాన్ : ఆల్వేస్ ఆన్ ప్లాన్ కింద 18 లేదా 24 నెలల కాల వ్యవధిలో కస్టమర్‌లు ఎంపిక చేసుకున్న ఈఎంఐని బట్టి రూ.350 లేదా రూ.300 మాత్రమే చెల్లించాలి. ఇందులో వినియోగదారులు నెలకు 5జీబీ డేటా ప్లస్ 100నిమిషాల టాక్‌టైమ్‌ను కూడా పొందుతారు.
రెండవ ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ లార్జ్ ప్లాన్ కింద కస్టమర్లు 18 నెలలకు రూ.500, 24 నెలలకు రూ.450 చెల్లించాలి. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌ను పొందవచ్చు.
మూడో ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ కోసం జియో మూడవ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్‌ఎల్ అని పిలిచే మూడో ప్లాన్‌లో వినియోగదారులు 18 నెలలకు రూ. 550 లేదా 24 నెలలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 2జీబీ హై స్పీడ్ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
నాల‍్గవ ప్లాన్ : చివరిగా నాల్గవ ప్లాన్ ఎక్స్ ఎక్స్‌ఎల్ ప్లాన్. ఈ ప్లాన్‌లో జియో ఫోన్ కొనుగోలుదారులు నెలకు రూ. 600 చొప్పున 18 నెలల పాటు లేదా 24 నెలల పాటు రూ. 550 చెల్లించాలి. ఈ ఆఫర్ వినియోగదారులకు 24 నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 2.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు.
జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 )
స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్
ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు
బ్యాక్ కెమెరా: 13 ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ
బ్యాటరీ: 3500 ఎంఏహెచ్
సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్)
సిమ్ పరిమాణం: నానో
కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్‌బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం
సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్
అంతేకాదు ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ ను గూగుల్ డెవలప్ చేసింది. జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దగా చదవడం, ట్రాన్స్‌లేట్ చేసుకునేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ మై జియో, జియో సినిమా,జియో టీవీ, జియో సావన్‌తో పాటు మరికొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే సదుపాయం ఉంది.
0 comments:
Post a Comment