Dupilcate PPO: ఎ పి గవర్నమెంటు పెన్షనర్ల PPO మిస్ అయితే డూప్లికేట్ పిపిఓ పొందడం ఎలా ???

పెన్షనర్ కు చెందిన PPO కనిపించక పోతే ,ఇక దొరకదని రూఢీ అయితె ఆ పెన్షనర్ / ఫేమలీ పెన్షనర్ / వారసులు డూప్లికేట్ పిపిఓ కోసం వారి జిల్లా ట్రెజరీ అధికారివారికి పెన్షన్ పొందుతున్న  సబ్ ట్రెజరీ అధికారివారి ద్వారా ఓ దరఖాస్తు పంపాలి.దీనికోరకు ముందుగా మన నివాస ప్రాంతపు పోలీసు స్టేషన్ లో మన పిపిఓ మిస్ (దొంగిలించబడింది , పడిపోయింది etc) అయింది అని అది చాలా అవసరమైంది కావునా ట్రేస్ చేయమని ఓ కంప్లైట్ ఇవ్వాలి. దానిపై వారు విచారణ చేసి _Non availability Certificate_ ఇస్తారు. దీనిని తీసుకోవాలి.

         పెన్షనర్ పి పి ఓ ఒరిజనల్ కాపీ  పోయినందున డూప్లికేట్ అవసరమయిందని ,లేదా ఫేమలీ పెన్షన్ పొందుటకు పామిలీ పెన్షనర్ కు అవసరమైందని Duplicate PPO ఎందుకు అవసరమో వివరంగా వ్రాస్తూ  డూప్లికేట్ ఇప్పించమని ఓ తెల్లకాగితంపై దరఖాస్తువ్రాసి, అందు సర్వీసు పెన్షనర్ పేరు ,పిపిఓ నెంబరు, బ్యాంక్ ఖాతావివరాలు, అడ్రస్ , ఆధార్ డిటేల్స్ , చివరగా తీసుకున్న పెన్షన్ వివరాలు వ్రాసి STO గారిద్వారా DTO గారికిదరఖాస్తు చేయాలి. దరఖాస్తు తోపాటు పోలీస్ వారినుండి తీసుకున్న Non availability Certificate , PPO xerox , Bank Pass book మొదటి పేజీ కాపీ , నిర్ణీత ఫీజు 50/ చెల్లించిన చలానా జతపరచి ఇవ్వాలి.

ట్రెజరీ అదికారి కోరితే పిపిఓ పోయిందని తిరిగి దొరికితే దానిని తిరిగి వారికి అందించగలననే అఫిడ్విట్ వ్రాసి ఇవ్వవలసి రావచ్చు.

సంబందిత STO గారు దానిని పరిశీలించి , దృవీకరించి డూప్లికేట్ పి పి ఓ ఇవ్వవచ్చని డి టి ఓ గారికి ఎండార్సుమెంట్ వ్రాసి పంపుతారు,  తదుపరి డి టి ఓ గారు వారికార్యాలయంలో ఉండే మన రికార్డ్స్ ఆధారంగా డూప్లికేట్ పి పి ఓ ఇష్యూ చేస్తారు.


చలాన్ హెడ్స్ డిటేల్స్ 

Major Head         0070

Sub Major Head      60

Minor Head           800

Group Sub Head     00

Sub Head                 81

Detailed Head       

Sub Detailed Head 


Amount  Rs.50/-

purpose for which amount is deposed - For issue of duplicate PPO

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top