నూతన జాతీయ విద్యా విధానము --
జిల్లాయందలి అందరు మండల విద్యా శాఖాధికారులకు/ ఉప విద్యాశాఖాధికారులకు తెలియచేయడమేమనగా డైరెక్టర్ పాఠశాల విద్య, ఆంద్ర ప్రదేశ్, అమరావతి వారి ఆదేశముల (Rc.No.151-A&I-2020, Dt.18-10-2021) మేరకు నూతన జాతీయ విద్యా విధానము అమలులో భాగముగా మీ పరిధిలోని ఉన్నత పాఠశాల ప్రాంగణములో / ఉన్నత పాఠశాలకు ప్రక్కనే / ఉన్నత పాఠశాలకు 250 మీటర్ల లోపు ఉన్నటువంటి ప్రాధమిక పాఠశాలలకు సంబంధించిన 3,4 మరియు 5వ తరగతుల విద్యార్ధులను నిబంధనల మేరకు ఆయా ఉన్నత పాఠశాలల్లో విలీనము చేయవలసియున్నది.
కావున వెంటనే 3,4 మరియు 5వ తరగతుల విద్యార్ధులను ఉన్నత పాఠశాలల్లో విలీనము చేయు ప్రక్రియను వెంటనే పూర్తి చేసి సదరు నివేదికను ఈ కార్యాలయమునకు తేదీ.01-11-2021 సాయంత్రం 5-00 గంటలలోగా సమర్పించవలసినదిగా కోరడమైనది.
-- జిల్లా విద్యాశాఖాధికారి, నెల్లూరు
0 comments:
Post a Comment