CRP: Cluster Resource Persons Duties and Responsibilities: పాఠశాల విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కొన్ని పాఠశాలలను కలిపి “పాఠశాల సముదాయం”గా ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల సముదాయం చైర్మన్ గా ఉన్న ప్రధానోపాధ్యాయులు ఆధీన పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలను మానిటరింగ్ చేయాలి. సముదాయ నిర్వహణలో ప్రధానోపాధ్యాయునికి సహాయకునిగా క్లస్టర్ రిసోర్స్ పర్సన్ పనిచేయాలి. ఈ అధ్యాయంలో మనము క్లస్టర్ రిసోర్స్ పర్సన్ విధులు . బాధ్యతల గురించి వివరంగా తెలుసుకుందాం.
CRP: Cluster Resource Persons Duties and Responsibilities:
* క్లస్టర్ రిపోర్స్ పర్సన్ పాఠశాల సముదాయం (స్కూల్ కాంప్లెక్స్) ప్రధానోపాధ్యాయుల ఆధీనంలో పనిచేయాలి.
* క్లస్టరు పరిధిలోగల పాఠశాలలన్నింటిని కనీసం నెలలో ఒకసారి తప్పని సరిగా సందర్శించాలి. సందర్శన రోజు ప్రార్థన సమయం నుండి పాఠశాల ముగింపు వరకు ఉండాలి.
* సందర్శించిన పాఠశాలల వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలలో Online Monitoring లో పొందుపరచాలి.
* ప్రతినెల అడ్వాన్సు టూర్ డైరీ, వర్క్-డన్ రిపోర్టు పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయుల ఆమోదంతో మండల విద్యాధికారికి, జిల్లా కార్యాలయానికి సమర్పించాలి.
* పాఠశాల సముదాయ సమావేశ నిర్వహణ తేదీని, అజెండా అంశాల సమాచారాన్ని ఆధీన పాఠశాలలకు అందించాలి.
* పాఠశాల సముదాయ సమావేశముల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు (బోధనాభ్యసన సామగ్రి వంటివి సమకూర్చుకోవడం) చేయాలి. సంబంధిత రిజిష్టర్లు నిర్వహించాలి. మీటింగ్ మినిట్స్
* ఆధీన పాఠశాలల నుండి 'SMF ఆధారంగా QMT Reports సేకరించాలి. మరియు CMF ను రూపొందించాలి.
* SMF, CMF ల వారు ఆధారంగా మండల స్థాయి, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిల్లో సమీక్ష నిర్వహించడంలో తోడ్పడాలి.
* పాఠశాల సముదాయ స్థాయిలో జరిగే Teleconference లకు ఏర్పాట్లు చేయాలి.
* అనుబంధ పాఠశాలలకు సంబంధించి కె.జి.బి.విలతో సహా పూర్తి సమాచారం సేకరించి, నివేదికలు తయారు చేసుకోవాలి. (నిర్ణీత నమూనాలో) * సర్వ శిక్షా అభియాన్ కార్యక్రమాలన్నింటిపైన అవగాహన కలిగి ఉండాలి. వాటి అమలుకు కృషి చేయాలి.
* ఆధీన పాఠశాలల ఆవాసప్రాంతాలలోని 6-14 సం॥ల వయస్సు గల పిల్లలందరి సమాచారం, భౌతిక సదుపాయాలు, ఉపాధ్యాయుల డేటా బేస్ సమాచారం సేకరించి, క్రోడీకరించి నిర్వహించాలి. వంటి మొత్తం
* ఎస్.ఎం.సి సమావేశాలను ఏర్పాటు చేసి, ఎస్.ఎం.సి సభ్యులు సమావేశాలకు హాజరగునట్లు చూసి, ఎస్.ఎం.సి భాగస్వామ్యం పాఠశాల కార్యక్రమాల్లో ఉండునట్లు చూడాలి.
* వివిధ స్థాయిలలో నిర్వహించే సమీక్షా సమావేశములకు పూర్తి సమాచారంతో హాజరు కావాలి.
* మండల స్థాయి ప్రధానోపాధ్యాయుల రివ్యూ సమావేశములలో QMT Reports, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలి.
* ఆధీన పరిధిలో గల పాఠశాలల యందు 100 శాతం నమోదు. 100 శాతం నిలకడ సాధనకు కృషి చేయాలి.
* ప్రధానంగా రెగ్యులర్ గా అనుపస్థితి అగుచున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి రెగ్యులర్గా హాజరగునట్లు చూడాలి.
* పాఠశాల సముదాయ పరిధిలోని ఆవాస ప్రాంతాల్లో అనుపస్థితి అవుతున్న విద్యార్థుల రిజిష్టర్ నిర్వహించాలి.
• పాఠశాల సముదాయం గ్రంథాలయాన్ని నిర్వహించాలి. స్టాక్ రిజిష్టరు, ఇష్యూ రిజిష్టరు నిర్వహించాలి. పాఠశాల సముదాయాన్ని ఒక అభ్యసన కేంద్రంగా (Reading Cell) తీర్చిదిద్దాలి.
* క్లస్టర్ స్థాయి ఎగ్జిబిషన్లు, మేళాలు మొదలగునవి నిర్వహించడంలో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులకు సహకరించాలి..
* బడిబయటి పిల్లల కొరకు ముఖ్యంగా పని నుండి విముక్తి పొందిన బాలకార్మికులకోసం. ఉద్దేశించబడిన అన్ని కార్యక్రమాలను అమలుచేయాలి.
* ఆధీన పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథక నిర్వహణను, టాయిలెట్లు, మంచినీటి ఏర్పాట్లు, వినియోగాన్ని పరిశీలించి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు వివరాలు అందజేయాలి.
* అన్ని విద్యా సంబంధ కార్యక్రమాలు అమలులో ప్రేరకునిగా (Motivator) ఉండాలి.
* పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు విద్యాభివృద్ధికి సంబంధించి అప్పగించే ఏ ఇతర పనినైనా నిర్వర్తించాలి.
* CAL పాఠశాలల్లో విద్యార్థులు కంప్యూటర్లు వినియోగించుటను గురించి తెలుసుకోవాలి.
* ROT లు పని చేసేటట్లు పర్యవేక్షణ చేయాలి. * పాఠశాలలో తరగతి బోధనలో కృత్యాలు, ప్రాజెక్టులు, అభ్యసన కేంద్రకంగా ఉండే ఇతర పద్ధతులు ఉపాధ్యాయులు అమలు పరిచే విధంగా తోడ్పడాలి. తమ పరిధిలో పనిచేయుచున్న సి.ఆర్.పిల అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి.. దాంతో పాటు ఆ నెల వర్క్డన్ నివేదికను కూడా జతచేసి జిల్లా ప్రాజెక్టు కార్యాలయానికి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతి అందజేయాలి. వాటి ఆధారంగా జిల్లా కార్యాలయం వారు గౌరవభృతి చెల్లించాలి. అనారోగ్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోగ్య కార్యకర్తలను సమన్వయ పరిచి పిల్లలు రెగ్యులర్ గా హాజరయ్యేటట్లు చూడాలి.
* బడి బయటి పిల్లలను వయస్సుకు తగిన తరగతులలో నమోదు చేసి స్థాయిని సాధించుటకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలలో (ఎస్.టి.సి) చేర్చాలి..
* సర్వ శిక్షా అభియాన్ నిర్వహించే పాఠశాల సముదాయ శిక్షణలకు తప్పని సరిగా హాజరు కావాలి.
* పాఠశాలలను సందర్శించినపుడు తరగతివారీగా, విషయాలవారీగా పూర్తి అయిన సిలబస్ వివరాలను సేకరించాలి. సిలబస్ పూర్తి కాని పాఠశాలల వివరాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు తెలియచేయాలి.
* మండల స్థాయి ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశములో, తమ పరిధిలో గల పాఠశాలల యొక్క విద్యార్థుల సాధనా స్థాయిల వివరాలను గ్రేడులలో అందుబాటులో ఉంచాలి.
* పాఠశాల సముదాయంలో రూపొందించాలి. నిర్వహించే అన్ని కార్యక్రమాల డాక్యుమెంటేషన్
* పాఠశాలలను సందర్శించినపుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (CWSN) సంబంధించిన సమాచారమును కూడా సేకరించాలి. అలాగే తన పరిధిలో ఐ.ఇ రిపోర్సు టీచరు (IERT) "ఇంటి వద్దనే విద్య కార్యక్రమము' క్రింద ఎంపిక చేసుకుని సందర్శించుచున్న గృహాలను నెలకు ఒకసారి సందర్శించి పిల్లల ప్రగతి, ఐ.ఇ.ఆర్.టి సందర్శనల తీరును నివేదికలందు పొందుపరుచవలయును.
* పాఠశాల సముదాయంలో, పాఠశాలల్లో బోధనోపకరణాలు, టి.వి., రేడియో, డివిడి ప్లేయర్, డిష్ అంటేన్నా, గణితం సైన్స్ కిట్లు, చార్టులు, నమూనాలు, మ్యాపులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ ప్రయోగశాల పరికరాలు మొదలగు వాటిని వినియోగించేట్లు చూడాలి. వినియోగ పోవడానికి కారకాలను స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టరు మరియు యం.ఇ.ఓకు సమాచారాన్ని ఇవ్వాలి.
0 comments:
Post a Comment