వ్యాసకర్త యం.రాం ప్రదీప్
ఐపిఎల్ మ్యాచులో భారత్ బౌలర్ షమీ ధారాళంగా పరుగులు ఇవ్వబట్టే పాకిస్థాన్ గెలిచిందని సామజిక మాధ్యమల్లో అతడిని మతం పేరుతో కొందరు దూషిస్తున్నారు.ఇటువంటి ధోరణులు వల్ల క్రీడాకారుల ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది.
ఆటలకు, మతాలకు సంబంధం లేదు. ప్రతి సంఘటనకు మతంతో ముడిపెట్టకూడదు.మనదేశంలో అనేక మతాలు,కులాలున్నాయి.తరతరాలుగా భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం ఆధారంగా జీవిస్తున్నాము.భారత రాజ్యాంగం లో కూడా మత ప్రస్తావన లేదు.మనకంటూ అధికార మతం ఏదీ లేదు.
మనది లౌకిక రాజ్యం కాబట్టే పొరుగు దేశాలతో పోలిస్తే మన
దేశంలో మత సామరస్యం ఇంకా వెల్లివిరుస్తుంది.
అయితే ప్రస్తుత పరిస్థితులు
చూస్తుంటే భిన్నత్వంలో ఏకత్వం అనే క్రమంగా బలహీన పడుతుందనే భావన కలుగుతుంది.ఒకప్పుడు పొరుగుదేశమైన బంగ్లాదేశ్ మన దేశంతో సన్నిహితంగా ఉండేది.భారత దేశ కృషి ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు
అక్కడ హిందువులపై దాడులు
జరుగుతున్నాయి.ఇదే సమయంలో మనదేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి.
భారత దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవాలి.అందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలి.భారత తొలి ఉప
ప్రధాని వల్లబాయ్ పటేల్ జయంతిని ప్రతి ఏటా జాతీయ
ఐక్యతా దినోత్సవంగా జరుపుతారు.
దేశంలో ప్రజలు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలంటే ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలి.
విద్యార్థులకు సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా కనీసం డిగ్రీ వరకు
ఉండాలి.భారత రాజ్యాంగ ప్రతులను ఛత్తీస్ ఘడ్ తరహా విద్యార్థులకు ఉచితంగా అందించాలి. మతం వ్యక్తిగత అంశం అని రాజ్యాంగం చెప్తుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలుసార్లు స్పష్టం చేసింది. మత విషయాలలో పాలకులు అతిగా జోక్యం చేసుకోవడం వల్ల అది ఒక సున్నితమైన విషయంగా మారింది. దేశంలో పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు కూడా ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాయి.కరోనా పరిస్థితులు కూడా పేదరికాన్ని
పెంచుతున్నాయి.
జవహర్ లాల్ నెహ్రూ,వల్లబాయ్ పటేల్ వంటి నాటి దార్శనికులు దేశానికి దిశానిర్దేశం చేశారు. వల్లభాయ్ పటేల్ 500లకు పైగా ఉన్న సంస్థానాలని భారత దేశంలో విలీనం చేశారు. గురజాడ అన్నట్లు దేశంలో మట్టితో పాటు మనుషులు కూడా ఉంటారు. పాలకులు వట్టి మాటలు కట్టి పెట్టి,ప్రజల మేలుకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఆకలితో ఉన్నవారికి ఐక్యతని గుర్తుచేయలేము.ఆకలిదప్పుల
నుంచి పేదవారికి విముక్తి కల్పిస్తే అందరినోటా ఐక్యతా రాగం వినిపిస్తుంది.
తిరువూరు
9492712836
0 comments:
Post a Comment